Daaku Maharaaj :డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. ముఖ్యఅతిథిగా ఏపీ ఐటీ శాఖ మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం "డాకు మహారాజ్". ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.
సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తోంది.
ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
ఈ నెల 8 లేదా 9న అనంతపురంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
వివరాలు
కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా బాలకృష్ణ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ రానున్నారని సమాచారం.
"మామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లుడు రానున్నాడు" అనే వార్తతో ఫ్యాన్స్ మధ్య ఆనందం విపరీతంగా పెరిగింది.
ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో "డాకు మహారాజ్"పై భారీ అంచనాలు ఏర్పడాయి.