LOADING...
Shobhita pregnancy : చైతన్య తండ్రి అవుతున్నాడా? రూమర్లపై స్పందించిన నాగార్జున
చైతన్య తండ్రి అవుతున్నాడా? రూమర్లపై స్పందించిన నాగార్జున

Shobhita pregnancy : చైతన్య తండ్రి అవుతున్నాడా? రూమర్లపై స్పందించిన నాగార్జున

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 22, 2025
01:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల సోషల్ మీడియాలో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈప్రచారంపై తాజాగా అక్కినేని నాగార్జున స్పష్టత ఇచ్చారు. ఇవన్నీ పూర్తిగా రూమర్లేనని తేల్చిచెప్పారు. ఒక కార్యక్రమంలో నాగార్జునను ఉద్దేశించి 'తండ్రి నుంచి తాతగా ప్రమోషన్ పొందుతున్నారా?' అనే ప్రశ్న ఎదురవ్వగా, ఆయన సరదాగా 'సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానని సమాధానం ఇచ్చారు. అయితే ఈ మర్యాదపూర్వకమైన జవాబును కొందరు తప్పుగా అర్థం చేసుకుని, శోభిత గర్భవతి అన్న ప్రచారాన్ని మొదలుపెట్టారని నాగార్జున తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత విషయాలపై వార్తలు రాసేటప్పుడు మీడియా మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదే సమయంలో తన కోడలు శోభితపై నాగార్జున ప్రశంసల జల్లు కురిపించారు.

Details

స్వయంగా నేనే తెలియజేస్తా

శోభిత తమ కుటుంబంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో సంతోషం మరింత పెరిగిందని, ఆమె ప్రతి విషయంలోనూ ఎంతో పాజిటివ్‌గా ఉంటుందని చెప్పారు. శోభిత చాలా గ్రౌండెడ్ అమ్మాయి అని, ఆమె రాకతో తమ జీవితాలు మరింత కళకళలాడుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారని, తాతయ్యను చేసే నిజమైన 'గుడ్ న్యూస్' ఏదైనా ఉంటే దాన్ని తామే స్వయంగా అందరికీ తెలియజేస్తామని నాగార్జున స్పష్టం చేశారు. దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న ఊహాగానాలకు ఒక్కసారిగా ముగింపు పడినట్లైంది.

Advertisement