LOADING...
Samantha: తల్లి కాబోతున్న సమంత?.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్!
తల్లి కాబోతున్న సమంత?.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్!

Samantha: తల్లి కాబోతున్న సమంత?.. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటిగా, నిర్మాతగా బిజీగా గడుపుతోంది. గతేడాది దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం సమంత తల్లి కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సమంత సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకుంది. 'ఏ మాయ చేశావే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది.

వివరాలు

గతేడాది రాజ్ నిడిమోరుతో వివాహం

నాగచైతన్యతో నాలుగేళ్ల దాంపత్య జీవితంలో పలుమార్లు సమంత గర్భవతి అనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అవన్నీ తర్వాత పుకార్లుగానే మిగిలిపోయాయి. అనంతరం వ్యక్తిగత విభేదాల కారణంగా నాగచైతన్య, సమంత విడిపోయారు. విడాకుల తర్వాత సమంత ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధితో పోరాడిన ఆమె, ధైర్యంగా ఆ సమస్యను అధిగమించింది. ఆ కష్టకాలంలో ఆమెకు అండగా నిలిచిన వారిలో రాజ్ నిడిమోరు కూడా ఒకరు. వీరిద్దరి స్నేహం, అనుబంధంపై గతంలో పలు వార్తలు, విమర్శలు వచ్చినప్పటికీ వాటిని అధిగమించి గతేడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజ్‌తో పెళ్లి తర్వాత సమంతలో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు.

వివరాలు

జూన్ 19న 'మా ఇంటి బంగారం' రిలీజ్

ఇప్పుడు ఆమె తల్లి కాబోతుందనే వార్తలు రావడంతో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, సమంత ప్రధాన పాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు నిర్మించారు. ఈ సినిమా తర్వాత సమంత నటనకు కొంత విరామం ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో నిర్మాతగా ఎక్కువగా దృష్టి సారించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సమంత తల్లి కాబోతుందనే వార్తలపై రాజ్-సమంత జంట అధికారికంగా స్పందిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement