Loading...
Raaka: 'రాకా'లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారా? వైరల్ ప్రచారంపై అసలు నిజం ఇదే!
'రాకా'లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారా? వైరల్ ప్రచారంపై అసలు నిజం ఇదే!

Raaka: 'రాకా'లో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారా? వైరల్ ప్రచారంపై అసలు నిజం ఇదే!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 06, 2026
10:01 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాల విజువల్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు

విస్తృతంగా ప్రచారం..

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో 'రాకా' కోసం షారుఖ్ ఖాన్‌కు ప్రత్యేక పాత్రను రూపొందించారని, ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను విదేశీ లొకేషన్లలో చిత్రీకరించనున్నారని విస్తృతంగా ప్రచారం జరిగింది.

ముఖ్యంగా అట్లీ-షారుఖ్ కాంబినేషన్‌లో వచ్చిన 'జవాన్' ఘన విజయం సాధించిన తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత అనుబంధం కారణంగా ఈ వార్తలు మరింత బలంగా వినిపించాయి.

అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి షారుఖ్ పాత్రపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ గెస్ట్ రోల్ వార్తలు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికే పరిమితమైనవిగా తెలుస్తోంది.

వివరాలు

నిరంతరాయంగా షూటింగ్‌..

ఇదిలా ఉంటే, 'రాకా' చిత్రీకరణ మాత్రం శరవేగంగా కొనసాగుతోంది.

గత ఏడాది ముంబైలో ప్రారంభమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఇప్పటివరకు పెద్దగా విరామం లేకుండానే కొనసాగుతుండటం విశేషం.

ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ సంస్థ చేపట్టింది.

ప్రారంభంలో దుబాయ్‌తో పాటు పలు విదేశీ ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రణాళిక రూపొందించినప్పటికీ, ఇరాన్ ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ షెడ్యూళ్లను రద్దు చేశారు.

దీంతో ప్రస్తుతం ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లోనే షూటింగ్ కొనసాగుతోంది.

అల్లు అర్జున్ స్వల్ప విరామాలు మినహా దాదాపు నిరంతరాయంగా షూటింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం.

ADVERTISEMENT