
Pravasthi Elimination: ఇక్కడ న్యాయం ఉండదా?..'పాడుతా తీయగా'పై సింగర్ ప్రవస్తి షాకింగ్ కామెంట్స్..!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగులో అత్యంత సుదీర్ఘంగా నడుస్తున్న సంగీత ఆధారిత రియాలిటీ షోలలో 'పాడుతా తీయగా'కి ప్రత్యేక స్థానం ఉంది.
లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన ఈ షో తాజాగా సిల్వర్ జూబ్లీ సిరీస్ ప్రారంభించింది.
ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హోస్ట్ చేస్తున్నారు.
ఎంతో మంది ప్రతిభావంతులైన గాయకులను పరిచయం చేసిన ఈ షోపై తాజాగా సింగర్ ప్రవస్తి చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి.
ప్రవస్తి వ్యాఖ్యల వైరల్
ఇటీవల ఎన్నో షోలలో విజేతగా నిలిచిన ఆమె, ఇంత తొందరగా ఈ షో నుంచి వెళ్లిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తన ఎలిమినేషన్‌పై స్పందిస్తూ ప్రవస్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా చెప్పింది:
Details
స్టాంగ్ రిప్లే ఇచ్చిన ప్రవస్తి
పాడుతా తీయగాకి రావాలనుకునే సింగర్స్‌కి నా సలహా ఒక్కటే మీకు ఏదైనా రికమండేషన్ లేదా జడ్జిల దగ్గర నుంచి రిఫరెన్స్ ఉంటేనే ఈ షోలో పాల్గొనండి.
లేకపోతే అన్యాయం, మానసిక వేదన తప్ప ఇంకొటి ఉండదని పేర్కొంది. దీంతో ఆమెపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ పలువురు మెసేజ్‌లు చేయడం ప్రారంభించారు.
నువ్వు కూడా రికమండేషన్‌తోనే సూపర్ సింగర్ గెలిచావేమో. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉన్నప్పటి నుంచి మేము ఈ షో చూస్తున్నాం. ఎప్పుడూ న్యాయంగా మాత్రమే జడ్జిమెంట్లు ఉంటాయి.
నీలాంటి వాళ్లు వచ్చి పోతూనే ఉంటారని కామెంట్ చేశారు.
ఈ కామెంట్లపై ప్రవస్తి తక్షణమే స్పందించింది. నిజంగా ధైర్యం ఉంటే నీ ఒరిజినల్ అకౌంట్ నుంచే మెసేజ్ చేయ్ అని స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చింది.