LOADING...
OG Sequel: OG 2 ఖరారు..పవన్ కళ్యాణ్ లెజెండరీ సీక్వెల్ ఆఫీషియల్ గా అనౌన్స్!
OG 2 ఖరారు..పవన్ కళ్యాణ్ లెజెండరీ సీక్వెల్ ఆఫీషియల్ గా అనౌన్స్!

OG Sequel: OG 2 ఖరారు..పవన్ కళ్యాణ్ లెజెండరీ సీక్వెల్ ఆఫీషియల్ గా అనౌన్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా ప్రస్తుతం థియేటర్లలో మాస్ మానియా సృష్టిస్తోంది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం, తమన్ సంగీతం సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయని ప్రేక్షకులు అంటున్నారు. అయితే, 'ఓజీ' చిత్రాన్ని చూసిన అభిమానులకు సినిమా ముగిసిన వెంటనే మరో సర్‌ప్రైజ్‌ లభించింది. సినిమా ఎండింగ్‌లోని "OG 2 - COMING SOON" టైటిల్ కార్డు థియేటర్లలో ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ అఫీషియల్‌ సీక్వెల్ అనౌన్స్‌మెంట్‌ ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం కలిగించింది. పలు మీడియా వర్గాలు ఇప్పటికే దీనిని ధృవీకరిస్తున్నాయి. థియేటర్లలో కేకులు, హర్షధ్వానాలతో అభిమానులు ఈ వార్తను స్వాగతించారు.

వివరాలు 

 జపాన్ సమురాయ్ నేపథ్యంతో కూడిన గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కళ్యాణ్

'ఓజీ'లో పవన్ కళ్యాణ్ తన పాత్రకు జపాన్ సమురాయ్ నేపథ్యంతో కూడిన గ్యాంగ్‌స్టర్‌గా ఆకట్టుకున్నారు. సినిమా చివర్లో, ఓజీ తన సమురాయ్ గ్రూప్‌ను మోసం చేసిన యుకుజిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అయితే, జపాన్ యుకుజి లీడర్ ఓజీపై కోపంతో అతనిని వెతుకుతున్నట్లు స్క్రీన్‌లో చూపించారు. సినిమా చివర్లో ఓజీ తన సమురాయ్ గ్రూప్‌ని మోసం చేసిన యుకుజిలపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అయితే జపాన్ యుకుజి లీడర్ ఓజీపై పగ పెంచుకుంటూ అతడిని వెతుకుతున్నట్లు చూపించారు

వివరాలు 

సినిమా రాకకు రెండు సంవత్సరాలు

'OG 2' లో, ఓజీ జీవితంలో సత్య దాదా నుంచి విడిపోయిన తర్వాత జపాన్ వెళ్లిన గ్యాప్‌లో జరిగిన సంఘటనలను విస్తారంగా చూపించనున్నారు. ఇది మరింత యాక్షన్, ఎమోషన్ మరియు అంతర్జాతీయ స్థాయి చిత్రంగా రూపొందుతుందని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో #OG2, #WeWantOG2 అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తూ "పవన్ గారు సినిమాలకు గుడ్‌బై చెప్పినా, OG 2 తప్పనిసరిగా రావాలి" అని కోరుతున్నారు. OG సీక్వెల్ రూపొందితే, అది పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో లెజెండరీ చాప్టర్ అవుతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ఈ సినిమా రాకకు రెండు సంవత్సరాలు పట్టవచ్చు అని అభిమానుల్లో అంచనాలు వ్యక్తమవుతున్నాయి.