Om Movie: ధనుష్ 'ఓం' స్టోరీ ఇదేనా? అసలు కథను రివీల్ చేసిన దర్శకుడు!
ఈ వార్తాకథనం ఏంటి
ధనుష్ హీరోగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఓం'. ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం ఎర్రచందనం అక్రమ రవాణా, దాని చుట్టూ ఉన్న అండర్‌వరల్డ్ ప్రపంచం నేపథ్యంలో సాగుతుందా? అనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి సినిమా కథాంశంపై స్పష్టతనిచ్చారు. 'ఓం' చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే సాధారణ క్రైమ్ స్టోరీ కాదని ఆయన వెల్లడించారు. ఇందులో చాలా లోతైన భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.
వివరాలు
భావోద్వేగాల చుట్టూ కథ సాగుతుంది
కథ నేపథ్యం గురించి వివరిస్తూ.. "ఒక చెట్టుకు ఎన్నో కొమ్మలు విస్తరించి ఉన్నట్లే.. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మనుషులు ఏదో ఒక బలమైన అంశంతో ఎలా ముడిపడి ఉన్నారన్నదే ఈ కథ అని పేర్కొన్నారు.
ఈ సినిమాలోని పాత్రల జీవితాలు, వాటి మధ్య ఉండే అనుబంధాలు, బలమైన భావోద్వేగాల ప్రయాణమే ప్రధానంగా ఉంటుందని దర్శకుడు వివరించారు.
ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది కథకు నేపథ్యంగా మాత్రమే ఉండనుంది.
అసలు కథ మాత్రం విభిన్న ప్రాంతాలకు చెందిన వ్యక్తులు, వారి జీవితాలు, పరస్పర సంబంధాలు, భావోద్వేగాల చుట్టూ సాగనుందని అర్థమవుతోంది.