Page Loader
R Narayana Murthy: పవన్‌ సినిమా వల్ల థియేటర్లు బంద్ అన్నది అవాస్తవం : ఆర్. నారాయణమూర్తి
పవన్‌ సినిమా వల్ల థియేటర్లు బంద్ అన్నది అవాస్తవం : ఆర్. నారాయణమూర్తి

R Narayana Murthy: పవన్‌ సినిమా వల్ల థియేటర్లు బంద్ అన్నది అవాస్తవం : ఆర్. నారాయణమూర్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2025
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ నటుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఇటీవల మీడియా సమావేశంలో సినీ పరిశ్రమపై తాజా పరిణామాలను పరిగణలోకి తీసుకుంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని పరిశ్రమ పెద్దలు కలవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వకారణమని, విజేతలకు తన అభినందనలు తెలియజేశారు. అలాగే, ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరారు. పర్సంటేజీల వివాదంపై 'హరిహర వీరమల్లు' సినిమా కోసం థియేటర్లను జూన్ 1నుంచి బంద్ చేస్తున్నారనే వార్తను నారాయణమూర్తి ఖండించారు. అది అబద్ధం అంటూ స్పష్టం చేశారు. పర్సంటేజీ ఖరారవ్వడం తానే కాకుండా, ఇతర చిన్న నిర్మాతలకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.

Details

వినోదం ఖరీదుగా మారుతోంది

పర్సంటేజీ వ్యవస్థకు మద్దతు తెలిపిన ఆయన, సింగిల్ స్క్రీన్ థియేటర్లు నాశనమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "ఇవీ దేవాలయాల్లాంటివి. ఇవి ఇప్పుడు కల్యాణ మండపాలుగా మారిపోతున్నాయి. నిర్మాతలను కాపాడాలంటే, ఈ వ్యవస్థను పునరుజ్జీవింప చేయాలన్నారు. అలాగే, పరిశ్రమ పెద్దలు సీఎం చంద్రబాబును కలవాలన్న భావనను తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పారు. టికెట్ ధరల పెంపుపై కూడా విమర్శలు గుప్పించారు. "వినోదం ఖరీదుగా మారుతోంది. టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు, పరిశ్రమ రెండూ నష్టపోతున్నాయన్నారు. షోలే, మొఘల్-ఎ-ఆజం, లవకుశ వంటి సినిమాలు తీసినప్పుడు కూడా టికెట్ ధరలు పెంచలేదని చెప్పారు. "సినిమా బాగుంటే ప్రజలే వస్తారు. టికెట్ ధరలు పెంచితే అభిమానులే తమ హీరోల సినిమాలను మానేస్తున్నారంటూ తన గళాన్ని వినిపించారు.