LOADING...
Sunny Deol: హనుమంతుడి పాత్రలో నటించటం గర్వకారణం: సన్నీ డియోల్
హనుమంతుడి పాత్రలో నటించటం గర్వకారణం: సన్నీ డియోల్

Sunny Deol: హనుమంతుడి పాత్రలో నటించటం గర్వకారణం: సన్నీ డియోల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవబోతున్న చిత్రం 'రామాయణ' (Ramayana). సుమారు రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 45కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా కన్నడ స్టార్ యష్, లక్ష్మణుడిగా రవి దూబే, అలాగే హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్నారు. తన పాత్రపై తాజాగా స్పందించిన సన్నీ డియోల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. హనుమంతుడి పాత్రలో నటించటం తనకు ఎంతో గర్వకారణమని, ఇది వినోదభరితంగా, అల్లరి, ఉత్సాహంతో నిండిన పాత్ర అని తెలిపారు.

Details

త్వరలోనే షూటింగ్ ప్రారంభం

ఈ రోల్ కోసం త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఇలాంటి పాత్రలు చాలా సవాళ్లతో కూడుకున్నవని, అందులో పూర్తిగా లీనమై నాటకీయతను ప్రదర్శించాల్సి ఉంటుందని సన్నీ డియోల్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు ఒక మహత్తరమైన సినిమాటిక్ అనుభూతి అందించడానికి చిత్రబృందం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సినిమా హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ విలువలతో రూపొందుతుందని, ఏమాత్రం రాజీ పడడం లేదని ఆయన స్పష్టం చేశారు. రామాయణం లాంటి మహాకావ్యం ఎన్ని సార్లు తెరకెక్కించినా ప్రతీసారి కొత్త అనుభూతినే ఇస్తుందని సన్నీ డియోల్ ధీమా వ్యక్తం చేశారు.