Deepika Padukone: 'డబ్బు కాదు… వ్యక్తులే ముఖ్యం'.. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లకు నో చెప్పిన దీపికా పదుకొనే
ఈ వార్తాకథనం ఏంటి
దీపికా పదుకొణె తాజా వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దశాబ్దానికి పైగా భారీ బడ్జెట్ ప్రాజెక్టుల్లో నటించి, బాక్సాఫీస్ హిట్లకు హామీగా నిలిచిన ఆమె—ఇప్పుడు తన ప్రాధాన్యతలను పూర్తిగా మార్చుకున్నట్లు వెల్లడించింది. హార్పర్'స్ బజార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా చేసిన మాటలు ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలపై ఆసక్తి తగ్గిందా? 'ఇకపై రూ.100 కోట్లు, రూ.500 కోట్లు లేదా రూ.600 కోట్ల సినిమాల గురించి ఆలోచించను. నా ప్రాధాన్యతలు గణనీయంగా మారిపోయాయని దీపికా స్పష్టం చేసింది. బాక్సాఫీస్ రికార్డులు, భారీ కలెక్షన్ల వంటి అంశాలు తనను ఇక ఆకట్టుకోవడం లేదని తెలిపింది.
Details
డబ్బు కాదు… నిజం ముఖ్యం
"నాకు నిజమనిపించనిది ఏదీ నన్ను తాకదు. కొన్నిసార్లు నిర్మాతలు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేస్తారు. అది సరిపోతుందని అనుకుంటారు. కానీ నా కోసం అది అసలు ముఖ్యం కాదని ఆమె చెప్పింది. అలాగే వాణిజ్యంగా పెద్దవి కాని కొన్ని ప్రాజెక్టులు తనను ఆకర్షిస్తాయని, వ్యక్తులపై, సందేశంపై నమ్మకం ఉంటే వాటినే ఎంచుకుంటానని వివరించింది.
Details
ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయి?
దీపికా మాటలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఇటీవల 'స్పిరిట్', 'కల్కి 2898 AD' సీక్వెల్‌ల నుంచి రెమ్యునరేషన్, పని గంటల విభేధాల కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇవి రెండు కూడా భారీ బడ్జెట్ చిత్రాలే. ఈ నేపథ్యంతోనే ఆమె చేసిన వ్యాఖ్యలు లక్ష్యంగా కనిపిస్తున్నాయా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ హీరో ప్రభాస్ కావడం కూడా చర్చను మరింత రగిలిస్తోంది.
Details
స్వంత బ్యానర్‌పై ఫుల్ ఫోకస్
దీపికా ప్రస్తుతం తన బ్యానర్ కేఏ ప్రొడక్షన్స్ ద్వారా కొత్త టాలెంట్‌కు అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టింది. ఈ బ్యానర్ కింద 'ఛపాక్' చిత్రాన్ని నిర్మించింది. 'కొత్తవారిని ప్రోత్సహించడం నాకు ఎనర్జీ ఇస్తుంది. మా టీమ్ ఇప్పుడు కథల అభివృద్ధి, రచయితలు-దర్శకులకు మద్దతు ఇవ్వడంపై పనిచేస్తోంది. ఇదే ఇప్పుడు నాకు అర్థవంతంగా అనిపిస్తోందని ఆమె చెప్పింది. ఆరోగ్యం-పని సమతుల్యమే ప్రధానం 'రోజుకు ఎనిమిది గంటల పని చేస్తే చాలని నేను నమ్ముతున్నాను. ఆరోగ్యం బాగుంటేనే మనం మంచి పని ఇవ్వగలమని దీపికా స్పష్టం చేసింది.