LOADING...
iBomma: 'డబ్బు సంపాదించటం నీ వల్ల కాదు'.. భార్య, అత్త మాటలతో దారి తప్పిన ఐబొమ్మ రవి!
'డబ్బు సంపాదించటం నీ వల్ల కాదు'.. భార్య, అత్త మాటలతో దారి తప్పిన ఐబొమ్మ రవి!

iBomma: 'డబ్బు సంపాదించటం నీ వల్ల కాదు'.. భార్య, అత్త మాటలతో దారి తప్పిన ఐబొమ్మ రవి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దమ్ముంటే పట్టుకోమంటూ పోలీసులను సవాలు విసిరిన నెల రోజులకే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కటకటాల పాలయ్యాడు. అతని క్రిమినల్‌ మైండ్‌సెట్‌, గత జీవితం, తీసుకున్న నిర్ణయాలపై పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. కళాశాల దశ నుంచే అవమానాలను ఎదుర్కొంటూ వచ్చిన రవి, డబ్బే జీవితం మార్చగలదనే భావనతో ముందుకు సాగినట్లు దర్యాప్తులో బయటపడింది. 2016లో ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్న రవికి, ఉన్నత కుటుంబానికే చెందిన భార్యతో అనుసంధానం సరిగా కలిసి రాలేదు. తన సంపాదనతో ఆమె అవసరాలు తీర్చలేనని, జీవితాన్ని నెట్టుకురావటం కష్టమైపోతుందని అత్తమామల విమర్శలు అతడిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి.

Details

2021లో విడాకులు

డబ్బు సంపాదించడం నీ వల్ల కాదనే హేళనలను భరించలేక రవి దారి తప్పినట్లు తెలుస్తోంది. తనకు ఉన్న వెబ్‌ డిజైనింగ్‌ నైపుణ్యంతో ఐబొమ్మ, బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్లను రూపుదిద్దాడు. కొద్ది నెలల్లో బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకుల ప్రకటనలతో భారీ మొత్తాలు సంపాదించారు. తన ఆదాయాన్ని అన్ని ఆధారాలతో చూపించినా భార్య తిరిగి కలిసి రావడానికి నిరాకరించడంతో 2021లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. దీంతో రవి నెదర్లాండ్స్‌కి వెళ్లి అక్కడి నుంచే వెబ్‌సైట్లను నిర్వహించే సెటప్‌ చేసుకున్నాడు. ఐబొమ్మ, బప్పం టీవీ వంటి సైట్ల ద్వారా సేకరించిన 50లక్షల మంది వ్యక్తిగత డేటాను సైబర్‌ నేర గ్యాంగ్‌లకు, ఆన్‌లైన్‌ గేమింగ్‌ ముఠాలకు విక్రయించి దాదాపు రూ.20 కోట్లు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.