Page Loader
Jabardasth Abhi: హీరోగా జబర్దస్త్ అభి.. హారర్ మూవీ 'ది డెవిల్స్ చైర్'తో ఎంట్రీ!
హీరోగా జబర్దస్త్ అభి.. హారర్ మూవీ 'ది డెవిల్స్ చైర్'తో ఎంట్రీ!

Jabardasth Abhi: హీరోగా జబర్దస్త్ అభి.. హారర్ మూవీ 'ది డెవిల్స్ చైర్'తో ఎంట్రీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు టీవీ ప్రేక్షకులకు జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్‌ అదిరే అభి ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. హారర్ జానర్‌లో తెరకెక్కిన 'ది డెవిల్స్ చైర్' ద్వారా అభి టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర తెరకెక్కిస్తున్నారు. సాధారణంగా కొత్త దర్శకులు తమ తొలి చిత్రాన్ని ప్రేమకథలతో తెరకెక్కిస్తారు. కానీ గంగ సప్తశిఖర మాత్రం 'ది డెవిల్స్ చైర్' ద్వారా కొత్త ప్రయోగాన్ని చేశారు. హారర్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం కొత్త కాన్సెప్ట్‌తో పాటు, భయపెట్టే అంశాలను ఎక్కువగా కలిగి ఉందని చిత్రబృందం వెల్లడించింది.

Details

అప్‌డేటెడ్ ఏఐ టెక్నాలజీతో మేకింగ్

ఈ హారర్‌ చిత్రాన్ని అప్‌డేటెడ్‌ ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించినట్లు దర్శకుడు గంగ సప్తశిఖర తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకోవడంతో పాటు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. గతంలో ఆయన రూపొందించిన షార్ట్‌ ఫిలిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పలు అవార్డులను కూడా అందుకున్నాయి. లిమిటెడ్ బడ్జెట్‌తో, కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా గంగ సప్తశిఖర ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

Details

దురాశపై ఆసక్తికర కథ

ఈ చిత్రం మనిషి దురాశ అనే ప్రధాన కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకుని రూపొందించారు. 'ది డెవిల్స్‌ చైర్' టైటిల్ అన్ని భాషలకు సరిపోయేలా ఉంటుంది. ఈ కథలో మంచి సందేశం కూడా ఉందని హీరో అదిరే అభి వెల్లడించాడు. డెవిల్ మీ ఇంటికి వస్తుంది! ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ భయం పుట్టించేలా ఉంటుందని దర్శకుడు గంగ సప్తశిఖర పేర్కొన్నారు. అందరినీ ఆకట్టుకునేలా కథ, డ్రామా, వినోదం మిళితమై ఉంటాయని చెప్పారు. ఈ హారర్ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది.