Auto Ram Prasad: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ కి గాయలు?
ఈ వార్తాకథనం ఏంటి
జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
రాంప్రసాద్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.
గురువారం ఉదయం షూటింగ్‌కి వెళుతుండగా, తుక్కుగూడ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాంప్రసాద్ కారు ముందు వెళ్తున్న వాహనం హఠాత్తుగా బ్రేక్ వేయడంతో, అతని కారు ఆ వాహనాన్ని ఢీ కొట్టింది.
ఆ వెంటనే రాంప్రసాద్ కారు వెనుక నుండి వచ్చిన ఆటో ఢీకొట్టడం, రాంప్రసాద్ కారుకు ముందున్న మరో వాహనాన్ని కూడా ఢీ కొట్టడం జరిగింది.
వివరాలు
"దేవకీ నందన వాసుదేవ" సినిమాకు రచయిత
ఈ ప్రమాదంలో రాంప్రసాద్ స్వల్ప గాయాలు అవ్వగా , వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.
అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శీను లతో కలిసి చేసిన స్కిట్స్ అనేకం హిట్ అయ్యాయి.
ప్రస్తుతం సుధీర్, గెటప్ శీను హీరోలుగా తమ సత్తా చూపుతుండగా, రాంప్రసాద్ మాత్రం జబర్దస్త్‌లో టీం లీడర్‌గా కొనసాగుతున్నాడు.
అదనంగా, ఇటీవల "దేవకీ నందన వాసుదేవ" అనే సినిమాకు రచయితగా కూడా పని చేశాడు.