LOADING...
Actress Hema : జగనన్న పార్టీలోకి పిలిచినా కుదరలేదు… త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలుస్తా : నటి హేమ కీలక వ్యాఖ్యలు
జగనన్న పిలిచినా కుదరలేదు… త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలుస్తా : నటి హేమ కీలక వ్యాఖ్యలు

Actress Hema : జగనన్న పార్టీలోకి పిలిచినా కుదరలేదు… త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలుస్తా : నటి హేమ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న హేమ అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. లేడీ కమెడియన్‌గా కూడా అనేక చిత్రాల్లో నవ్వులు పూయించింది. అయితే కొన్నేళ్లుగా సినిమాలకు దూరమవుతూ వచ్చిన ఆమె, ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టుకై జైలుకూ వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఆ కేసులో తానేమాత్రం సంబంధం లేదని ఇటీవల అధికారికంగా క్లీన్ చిట్ వచ్చినట్లు హేమ వెల్లడించింది. హేమ రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆమె, వైసీపీ జాయిన్ అవుతుందనే వార్తలు కూడా ఓ దశలో వినిపించాయి. అయితే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉందని ఆమె చెప్పింది.

Details

ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది

తాజాగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ ప్రయాణం, భవిష్యత్‌ లక్ష్యాల గురించి హేమ వివరించింది. 2014 ఎన్నికల్లో మండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు హేమ గుర్తుచేసుకుంది. "అప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ కొత్తగా ప్రారంభించిన సమయం. కిరణ్ కుమార్ రెడ్డి గారిని బాగా సపోర్ట్ చేశాను. నా పుట్టిన రాజోలు రిజర్వ్ కావడంతో మండపేట నుంచి పోటీ చేశాను. నాకు 4వేల ఓట్లు వచ్చాయని చెప్పింది. 2019లో జగన్ తనను పిలిచారని, మరోసారి మీటింగ్‌కు కూడా ఆహ్వానించారని, కానీ వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోయానని హేమ తెలిపింది. అలాగే తాను ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమంలో పాల్గొన్నానని, ఇప్పుడు తన మైండ్‌సెట్‌ మారిపోయిందన్నారు.

Details

'మా' అసోసియేషన్ కు పవర్ ఫుల్ నాయకత్వం కావాలి

ఏ పార్టీలో చేరాలనే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. త్వరలో పవన్ కళ్యాణ్‌ను కలవనున్నట్లు హేమ తెలిపింది. 'మా' కోసం ఒక ఈవెంట్ చేయాలి. ఆ సపోర్ట్ కోసం పవన్ గారిని కలవాలి. రాజకీయంగా ఆయనతో పనిచేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేను. నా మీద జరిగిన దాడి, మా అసోసియేషన్ సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నానని హేమ చెప్పింది. పవన్ కళ్యాణ్ కుటుంబం రాజకీయాల్లో ఎదుర్కొన్న విమర్శల గురించి కూడా ఆమె ప్రస్తావించింది. "అప్పుడు 'మా' ఆయనకు సపోర్ట్ చేయలేదు. అందుకే మా అసోసియేషన్‌కు ఒక పవర్‌ఫుల్‌ నాయకత్వం కావాలని హేమ అభిప్రాయపడింది. దాసరి నారాయణ రావు తర్వాత ఇండస్ట్రీలో పెద్ద శక్తి పవన్ కళ్యాణ్‌గానే ఉన్నారని హేమ పేర్కొంది.

Advertisement

Details

టీటీడీ బోర్డు మెంబర్ కావాలన్నదే నా లక్ష్యం

'మా'కి శక్తి ఇవ్వగల సామర్థ్యం పవన్ కళ్యాణ్ గారిదే అని చెప్పింది. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం తన జీవితంపై దృష్టి పెట్టినట్లు హేమ స్పష్టం చేసింది. భవిష్యత్తులో తప్పకుండా రాజకీయాల్లో అడుగుపెడతానని, కానీ ఇప్పుడే సమయం కాదని తెలిపింది. తన వ్యక్తిగత కోరిక గురించి మాట్లాడుతూ వెంకటేశ్వరస్వామిని చాలా ఇష్టపడతాను. నా జీవితంలో ఎప్పటికైనా టీటీడీ బోర్డు మెంబర్ అవ్వాలి అనేది నా లక్ష్యం. చనిపోయేలోపు ఆ సేవ చేయాలని హేమ చెప్పింది. అంతిమంగా, భవిష్యత్తులో హేమ ఏ రాజకీయ పార్టీ వైపు మెగ్గుచూపుతుందో చూడాల్సి ఉంది.

Advertisement