Jagapathi Babu: ముఖంపై గాయాలతో కనిపించిన జగపతిబాబు..అసలు ఏమైందో చెప్పిన నటుడు!
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ సీనియర్ నటుడు, విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జగపతి బాబు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లతో పాటు వ్యక్తిగత జీవితంలోని సరదా క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తనపై తానే సెటైర్లు వేసుకుంటూ, వినోదాత్మక క్యాప్షన్లతో పోస్టులు చేయడం ఆయన ప్రత్యేకత. తాజాగా ఆయన షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈసారి ఆయన చేసిన వంటకం కంటే, ఆయన ముఖంపై కనిపించిన గాయాలే అభిమానులను ఎక్కువగా ఆందోళనకు గురిచేశాయి.
వివరాలు
కుకీస్ చేస్తూ వీడియో
ఇటీవల జగపతి బాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'చాక్లెట్ చిప్ కుకీస్' తయారు చేస్తున్న వీడియోను పోస్టు చేశారు.
ఈ రెసిపీని తన పెద్ద కుమార్తె వద్ద నేర్చుకున్నానని చెబుతూ, తనదైన సరదా శైలిలో కుకీస్ ఎలా తయారు చేయాలో వివరించారు.
అయితే వీడియోలో ఆయన ముఖంపై, ముఖ్యంగా కళ్ల కింద గాయాల మచ్చలు స్పష్టంగా కనిపించాయి. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
"ఎవరూ కొట్టలేదు.. చిన్న సర్జరీ చేయించుకున్నా"
అభిమానులు కంగారుపడతారని ముందే ఊహించిన జగపతి బాబు, వీడియో ప్రారంభంలోనే దీనిపై వివరణ ఇచ్చారు.
"నా ముఖం చూసి ఎవడో పగలగొట్టాడని అనుకుంటున్నారా? ఎవరూ పగలగొట్టలేదు.
నేనే ఓ చిన్న సర్జరీ చేయించుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నాను.. కంగారు పడకండంటూ చిరునవ్వుతో చెప్పారు.
వివరాలు
సర్జరీ వివరాలు వెల్లడించని జగపతి బాబు
అయితే ఆయన ఎలాంటి సర్జరీ చేయించుకున్నారు? ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.
అభిమానుల నుంచి త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు
ఈ వీడియో చూసిన అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. "ఏమైంది సర్?" , "మీ ఆరోగ్యం జాగ్రత్త", "త్వరగా కోలుకోండి" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు ఇంత సీరియస్ విషయాన్ని కూడా ఎంతో సరదాగా చెబుతూ అభిమానుల్లోని టెన్షన్‌ను తగ్గించిన జగపతి బాబు తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.