Loading...
Jailer 2: 'జైలర్ 2' ఫస్ట్ క్యారెక్టర్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు పవర్‌ఫుల్ రోల్!

Jailer 2: 'జైలర్ 2' ఫస్ట్ క్యారెక్టర్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు పవర్‌ఫుల్ రోల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 19, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'జైలర్ 2' సీక్వెల్ నుంచి ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. 2023లో విడుదలైన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో.. దానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'జైలర్ 2'పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో 'జైలర్ 2' నుంచి మేకర్స్ తొలి క్యారెక్టర్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడును దిలీప్ పాత్రలో పరిచయం చేశారు. ఈ క్యారెక్టర్ లుక్‌కు ఊహించని స్థాయిలో స్పందన వస్తోంది.

వివరాలు

'జైలర్ 2'లో భారీ తారాగణం

తాజాగా విడుదలైన 35 సెకన్ల క్యారెక్టర్ ప్రోమోలో సూరజ్ వెంజరమూడును స్టైలిష్, ఇంటెన్స్ లుక్‌లో చూపించారు.

ఆయన పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా పరిచయం చేశారు. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ క్యారెక్టర్ ఇంట్రోకు మరింత హైప్ తీసుకొచ్చింది.

'జైలర్ 2'లో తొలి భాగంలోని పలువురు నటీనటులు తమ పాత్రలను కొనసాగించనున్నారు. రమ్యకృష్ణన్, యోగిబాబు, మీర్నా కీలక పాత్రల్లో మరోసారి కనిపించనున్నారు. అయితే ఈసారి సినిమాకు మరింత భారీ తారాగణాన్ని జోడించారు.

శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన 'జైలర్ 2' గ్లింప్స్‌కు కూడా మంచి స్పందన లభించింది.

వివరాలు

సంగీతాన్ని అందించిన అనిరుధ్ రవిచందర్

తొలి సినిమాలో ముగిసిన కథకు కొనసాగింపుగా ముత్తువేల్ పాండియన్ ఈసారి మరింత పెద్ద సమస్యలో చిక్కుకోబోతున్నాడనే హింట్‌ను గ్లింప్స్ ఇచ్చాయి.

కలానిధి మారన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

'జైలర్ 2'ను 2026 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

ADVERTISEMENT

వివరాలు

రజనీకాంత్‌ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..

ఇక రజనీకాంత్ తదుపరి ప్రాజెక్టుల విషయానికొస్తే.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్' అనే యాక్షన్ సినిమాలో ఆయన నటిస్తున్నారు.

ఇందులో రజనీకాంత్ స్టైలిష్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సిమ్రాన్, యోగిబాబు, రాశిఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే కమల్ హాసన్‌తో కలిసి 'KHxRK' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న మరో ప్రాజెక్ట్‌లోనూ రజనీకాంత్ నటించనున్నారు.

ADVERTISEMENT