Page Loader
'నేను కనిపించకపోతే అడిగేవారు'.. రజనీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సెట్లో రజనీకాంత్ బిహేవియర్ పై వినాయకన్ కామెంట్స్

'నేను కనిపించకపోతే అడిగేవారు'.. రజనీకాంత్ పై జైలర్ విలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 18, 2023
01:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న రజనీకాంత్, జైలర్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేశారు. అయితే తాజాగా జైలర్ సినిమా విలన్ వినాయకన్, రజనీకాంత్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జైలర్ సినిమా షూటింగ్ సెట్లో రజినీకాంత్ ఎలా బిహేవ్ చేసేవారో వినాయకన్ చెప్పుకొచ్చారు. షూటింగ్ సెట్లోకి రాగానే తాను కనిపించకపోతే వినాయకన్ ఎక్కడ ఉన్నాడని అడిగే వారిని, తాను కనిపించగానే కౌగిలించుకుని మరీ పలకరించే వారిని వినాయకన్ అన్నారు.

Details

ఫ్రీగా ఉండమని రజనీకాంత్ సలహా 

అలాగే ఒకే ఫ్రేమ్ లో ఇద్దరూ కలిసి నటించేటప్పుడు కాస్త ఇబ్బంది పడితే నచ్చినట్టుగా చేయమని ఫ్రీగా ఉండమని రజనీకాంత్ సలహా ఇచ్చేవారని వినాయకన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వినాయకన్ చేసిన కామెంట్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారుతున్నాయి. కన్నడ, మలయాళం భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన వినాయకన్, జైలర్ సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కాయి. అదలా ఉంచితే, జైలర్ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.