Prabhas : డార్లింగ్‌కు జక్కన్న స్పెషల్ లేఖ.. జపాన్ లో క్రేజ్‌కి ఇదే నిదర్శనం!
ఈ వార్తాకథనం ఏంటి
దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనదైన ముద్ర వేసే చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందారు. ఆయన తీసిన సినిమాలే కాదు, వాటిలో నటించిన హీరోలకూ అంతర్జాతీయ స్థాయిలో అపారమైన గుర్తింపును తెచ్చారు. అందులో ముందువరుసలో నిలిచేది మన డార్లింగ్ ప్రభాస్. 'బాహుబలి' సిరీస్ విజయం ప్రభాస్‌కు జపాన్‌లో అసాధారణమైన అభిమానాన్ని, భారీ క్రేజ్‌ను అందించింది. ఇటీవల 'బాహుబలి' రెండు భాగాలను కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో జపాన్‌లో ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీమియర్‌కు ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డ స్వయంగా హాజరయ్యారు. ఆ వేడుకలో అభిమానుల ప్రేమ, క్రేజ్ ఎంత ఉందో చెప్పేందుకు ప్రభాస్ రాజమౌళి రాసిన ఒక ప్రత్యేక లేఖను అభిమానులతో పంచుకున్నారు.
Details
తన
ఆ లేఖలో రాజమౌళి వెల్లడించిన విషయం ఏమిటంటే... ఆయన ఇప్పటివరకు నలుగుర్తలు జపాన్‌కు వెళ్లారని, ప్రతి సారి అక్కడ ప్రేక్షకులు అడిగే మొదటి ప్రశ్న — 'ప్రభాస్ ఎప్పుడు జపాన్‌కు వస్తారు?' అనే దేనని చెప్పారు. దీనిని ప్రస్తావిస్తూ, 'నా బాహుబలి ఇప్పుడు తన రెండో ఇంటి నేలపై అడుగుపెట్టాడు. ఈ పర్యటనను నువ్వు ఆనందంగా అనుభవిస్తున్నావని నమ్ముతున్నానని రాజమౌళి ప్రేమగా రాశారు. ఈ లేఖకు ప్రభాస్ కూడా హృదయపూర్వకంగా స్పందిస్తూ, 'త్వరలో మనిద్దరం కలిసి జపాన్‌కి వెళ్దాం అని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వైరల్ అవుతోంది. జపాన్ ప్రేక్షకులు ప్రభాస్‌ను ఎంతగా ప్రేమిస్తారో చెప్పేందుకు ఇదొక స్పష్టమైన ఉదాహరణగా చెప్పొచ్చు.