Jana Nayagan: మలేసియాలో చరిత్ర సృష్టించిన 'జన నాయగన్'.. ఆడియో లాంచ్‌కు రికార్డుస్థాయిలో హాజరు!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మలేసియా వేదికగా నిర్వహించిన ఆడియో లాంచ్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించింది. భారీ స్థాయిలో జరిగిన ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి విజయ్ అభిమానులు తరలివచ్చారు. ఏకంగా 85,000 మందికి పైగా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. భారతదేశం వెలుపల జరిగిన తమిళ సినిమా ఆడియో లాంచ్‌కు ఇంత భారీగా ప్రేక్షకులు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ అరుదైన ఘనతతో ఈ కార్యక్రమం మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అధికారికంగా నమోదు అయింది.
Details
పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్
ఈ ఈవెంట్‌లో విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. అభిమానుల సమక్షంలోనే ఆయన సినిమాల నుంచి రిటైర్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంతకాలం నా సినిమాలను ఆదరించి, నన్ను నిలబెట్టిన అభిమానుల కోసం మరో 30 ఏళ్లు సేవ చేస్తాను. ప్రజలకు సేవ చేయడానికే సినిమాలకు స్వస్తి పలుకుతున్నానని విజయ్ భావోద్వేగంగా చెప్పారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జన నాయగన్' చిత్రంలో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మమిత బైజు, ప్రియమణి, బాబీ దేవోల్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ చేసిన డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను మరింత ఉత్సాహపరిచాయి.