Tvk Vijay : సెన్సార్ వివాదంతో వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
దళపతి విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతున్న 'జన నాయగన్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ 69వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొంతకాలంగా అయోమయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సెన్సార్ బోర్డుతో కొనసాగుతున్న న్యాయపోరాటం కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతోంది. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన అప్‌డేట్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే చిత్రాన్ని సెన్సార్ బోర్డుకు సమర్పించినప్పటికీ, కొన్ని అభ్యంతరాల కారణంగా సెన్సార్ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది. ఈ వివాదంపై ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కోర్టు నుంచి తుది తీర్పు వెలువడిన తర్వాతే సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ లభించనుంది.
Details
ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, నిర్మాతలు ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 20 నిమిషాల ఫుటేజ్‌ను తొలగించి, కొన్ని డైలాగ్స్‌ను మ్యూట్ చేసి మరోసారి సెన్సార్‌కు పంపినట్లు సమాచారం. సెన్సార్ నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకపోతే, ఈ నెల 13వ తేదీన లేదా నెల చివరి వారంలో సినిమాను విడుదల చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. ఇక మరోవైపు 'జన నాయగన్' విడుదల వాయిదా పడటం వల్ల నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.