LOADING...
Jana Nayagan: విజయ్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా 'జననాయగన్‌' రిలీజ్‌? స్పెషల్‌ ప్లాన్‌ రెడీ!
విజయ్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా 'జననాయగన్‌' రిలీజ్‌? స్పెషల్‌ ప్లాన్‌ రెడీ!

Jana Nayagan: విజయ్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా 'జననాయగన్‌' రిలీజ్‌? స్పెషల్‌ ప్లాన్‌ రెడీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2026
12:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్‌ హీరో విజయ్ నటించిన 'జననాయగన్‌' చిత్రం విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా రివ్యూ కమిటీ పరిశీలనలో ఉండటంతో రిలీజ్‌ డేట్‌పై అనిశ్చితి నెలకొంది. దీంతో అభిమానులు సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో విడుదలకు సంబంధించిన ఓ తాజా వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మొదటగా జన నాయకన్ చిత్రాన్ని జనవరిలో భారీ స్థాయిలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. అయితే సెన్సార్‌ సర్టిఫికెట్‌ లభించకపోవడంతో చివరి నిమిషంలో రిలీజ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది.

Details

జూన్ 18న రిలీజయ్యే అవకాశం

తర్వాత అన్ని సమస్యలు పరిష్కారమైతే ఫిబ్రవరిలో విడుదల చేయాలనే ప్రణాళిక రూపొందించారు. కానీ రివ్యూ కమిటీ నుంచి ఇంకా తుది నివేదిక రాకపోవడంతో ఈ నెలలో కూడా సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాను విడుదల చేయాలనే ఆలోచన మేకర్స్‌లో ఉన్నట్లు సమాచారం. జూన్‌ 22న విజయ్‌ జన్మదినం కావడంతో, జూన్‌ 18న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement