LOADING...
JanaNayagan : 'జననాయగన్' తెలుగు రైట్స్ మార్పు.. నాగవంశీ నుంచి దిల్ రాజు చేతికి
'జననాయగన్' తెలుగు రైట్స్ మార్పు.. నాగవంశీ నుంచి దిల్ రాజు చేతికి

JanaNayagan : 'జననాయగన్' తెలుగు రైట్స్ మార్పు.. నాగవంశీ నుంచి దిల్ రాజు చేతికి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'జననాయకన్'. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌లో 'జననాయకుడు' అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళం, తెలుగులో ఒకేసారి థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. విజయ్ నటించిన 'లియో' సినిమాను కూడా అప్పట్లో నాగవంశీనే కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయగా, మంచి స్థాయిలో రిలీజ్ ఇచ్చారు.

Details

తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో రిలీజ్

అదే క్రమంలో 'జననాయకుడు' హక్కులు కూడా నాగవంశీ చేతికి వెళ్లడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుందన్న అంచనాలేర్పడ్డాయి. అయితే తాజా అప్‌డేట్ ప్రకారం, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ తెలుగు రాష్ట్రాల్లో 'జననాయకన్' డిస్ట్రిబ్యూషన్‌ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌లో ఇతర హీరోల భారీ సినిమాలు రిలీజ్ కావడం గానీ, లేదా ఇతర కారణాల వల్ల గానీ నాగవంశీ ఈ డీల్‌ను క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'జననాయకుడు' తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగారు.

Details

నైజాం‌,  ఉత్తరాంధ్ర ప్రాంతాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం 

తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన నైజాం‌తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన సంస్థ ఎస్‌వీసీ (SVC) ద్వారా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. విజయ్ కెరీర్‌లోనే కీలక చిత్రంగా భావిస్తున్న 'జననాయకన్' తెలుగు మార్కెట్‌లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. దిల్ రాజు వంటి అనుభవజ్ఞుడైన నిర్మాత డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టడం సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

Advertisement