Jani Master : జానీ మాస్టర్ కి జనసేన పార్టీ కీలక ఆదేశాలు
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంలో చిక్కుకున్నాడు. ఒక 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన రాయదుర్గం పోలీసులు జానీపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అతన్ని పార్టీ కార్యక్రమాల నుంచి తాత్కాలికంగా తప్పించాలని నిర్ణయించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జనసేన పార్టీ ప్రకటనలో తెలియజేసింది.
పార్టీ కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని ఆదేశం
గత ఎన్నికల సమయంలో జానీ మాస్టర్ జనసేనలో చేరి, ప్రచార బాధ్యతలను స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రచారం ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహించారు. అంతేకాక, ఆయనకు జనసేన ప్రచార కమిటీ పదవి కూడా అప్పగించారు. అయితే, ప్రస్తుతం జానీ మాస్టర్ పేరు రేప్ కేసులో ప్రధానంగా వినిపిస్తుండగా, జనసేన ఆయనను పార్టీ కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీ అధినేత వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు.