
Homebound : ఆస్కార్ రేస్‌లోకి జాన్వీ.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ యంగ్ స్టార్ జాన్వీ కపూర్ నటించిన 'హోమ్‌బౌండ్' సినిమా 2026 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ ఘనతను శుక్రవారం (సెప్టెంబర్ 20) ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దర్శకుడు నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, జాన్వీ కపూర్ నిర్మించారు. కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతూ 98వ అకాడమీ అవార్డ్స్‌లో ఇండియా తరపున ఎంపిక కావడం చాలా గౌరవంగా ఉంది. టీమ్ అందరికీ హృదయపూర్వక అభినందనలని తెలిపారు.
Details
సంతోషం వ్యక్తం చేసిన డైరక్టర్
డైరెక్టర్ నీరజ్ ఘైవాన్, జాన్వీ కపూర్ కూడా సోషల్ మీడియాలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. జాన్వీ చెప్పినట్టుగా, "ఈ ప్రయాణం, ఈ కథ, ఇందులోని ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండటం నా జీవితానికి రివార్డ్ లాంటిదని తెలిపారు. హోమ్‌బౌండ్ నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం. ఇది గ్రామీణ భారతదేశంలో ఇద్దరు అబ్బాయిల కష్టపూరిత ప్రయాణాన్ని చూపిస్తుంది. గౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనుకున్న వారు మార్గంలో కుల, మతపరమైన అవరోధాలను ఎదుర్కొంటారు. ఈ సినిమా మేలో కెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయి స్టాండింగ్ ఒవేషన్ పొందింది.
Details
భారత సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు
తర్వాత టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో రెండో రన్నర్-అప్ అవార్డును గెలుచుకుంది. భారత సినిమా కోసం అంతర్జాతీయ వేదికపై పోటీ ఇవ్వనున్న హోమ్‌బౌండ్, సెప్టెంబర్ 26న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో భారత్ మళ్లీ ఫైనల్ షార్ట్‌లిస్ట్‌లో స్థానం కోసం 100కు పైగా అంతర్జాతీయ నామినేషన్లతో పోటీ పడనుంది.