Page Loader
Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌
కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌

Cannes 2025: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అదిరిపోయిన జాన్వీకపూర్‌ లుక్.. ఫొటోలు వైరల్‌

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

తారల తళుకులతో కేన్స్‌ చిత్రోత్సవం 78వ ఎడిషన్ ఘనంగా, హంగుల హలచలాలతో కొనసాగుతోంది. మే 13న ప్రారంభమైన ఈ అంతర్జాతీయ సినిమా వేడుక ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు తమ తొలి ప్రవేశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా,నటి జాన్వీ కపూర్‌ తొలిసారి కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గొని రాణించారు. ఆమె ధరించిన అందమైన వేషధారణ శ్రీదేవిని గుర్తు చేస్తూ ఫ్యాషన్‌ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. ఆమె లుక్‌కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.అదిరిప [

వివరాలు 

 కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2025లో ప్రదర్శనకు  'హోమ్‌ బౌండ్‌' 

జాన్వీ ధరించిన పొడవాటి గౌన్‌ రాచరికభవాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో,రెడ్‌ కార్పెట్‌పై ఆమె నడక ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ఆమెతో పాటు'హోమ్‌ బౌండ్‌' చిత్రబృందం కూడా ఈ ఉత్సవానికి హాజరైంది.రెడ్‌ కార్పెట్‌పై జాన్వీకి నటుడు ఇషాన్‌ ఖట్టర్‌ సహాయపడుతున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. జాన్వీ లుక్‌ను చూసినవారు,ఆమె తల్లి శ్రీదేవిని గుర్తు చేసుకుంటున్నారు. జాన్వీ కపూర్‌,ఇషాన్‌ ఖట్టర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'హోమ్‌ బౌండ్‌' అనే చిత్రం,దర్శకుడు నీరజ్‌ ఘైవాన్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈసినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2025లో ప్రదర్శనకు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం కావడం విశేషం. ఈగౌరవం తమ చిత్రబృందానికి దక్కిన గొప్ప గుర్తింపుగా జాన్వీ పేర్కొన్నారు.ఈ ఫెస్టివల్‌ కోసం 'హోమ్‌ బౌండ్‌' టీమ్‌ మొత్తం కేన్స్‌కు చేరుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో నటి జాన్వీకపూర్‌