Janhvi Kapoor: 15 ఏళ్లలోనే మానసిక వేదనకు గురయ్యా.. డీప్‌ఫేక్‌పై జాన్వీ కామెంట్స్ వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్, బాలీవుడ్ రంగాల్లో వరుస సినిమాలతో ముందుకు సాగుతున్న నటి జాన్వీ కపూర్, తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక బాధాకర ఘటనను ఇటీవల గుర్తుచేసుకుంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, టెక్నాలజీని తప్పుగా వినియోగించడం వల్ల తాను ఎంతగా మానసికంగా కృంగిపోయానో వెల్లడించింది. స్కూల్‌లో చదువుతున్న రోజుల్లో, తనకు కేవలం 15 ఏళ్లప్పుడు తన ఫోటోను అసభ్యంగా మార్పులు చేసి ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో ప్రచురించారని ఆమె తెలిపింది. ఈ విషయం తనకు ముందుగా తెలియదని, తన స్నేహితురాలు ఆ ఫోటోను చూపిన తర్వాతే తెలిసిందని చెప్పింది. ఆ ఫోటో చూసిన వెంటనే తాను తీవ్రంగా కలత చెంది, ఎలా స్పందించాలో అర్థం కాక కన్నీళ్లు పెట్టుకున్నానని ఆమె భావోద్వేగంగా వివరించింది.
వివరాలు
వరుస సినిమాలతో బిజీ..
అదే సమయంలో, సోషల్ మీడియాలో నైతిక పరిమితులు చాలా తక్కువగా ఉంటాయని అర్థమైందని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అప్పుడే తనలో ధైర్యాన్ని పెంపొందించుకున్నానని పేర్కొంది. ప్రస్తుతం తనపై వచ్చే విమర్శలు గానీ, మార్పులు చేసిన చిత్రాలు గానీ పెద్దగా ప్రభావం చూపవని ఆమె స్పష్టం చేసింది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇలాంటి సమస్యలు ఎదురవడం సహజమని, వాటిని భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని యువతకు సూచించింది. తన సినీ ప్రయాణం విషయానికి వస్తే, 'దేవర' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది. అంతేకాకుండా, మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులతో కూడా ఆమె బిజీగా కొనసాగుతోంది.