NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / RC16: బుచ్చిబాబు సనా తదుపరి చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ 
    తదుపరి వార్తా కథనం
    RC16: బుచ్చిబాబు సనా తదుపరి చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ 
    బుచ్చిబాబు సనా తదుపరి చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్

    RC16: బుచ్చిబాబు సనా తదుపరి చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 06, 2024
    10:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    గేమ్ ఛేంచర్ సినిమా తర్వాత బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ మూవీ చేయనున్నాడు.

    ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలో చరణ్ ఈ సినిమా షూటింగ్‌లో కూడా జాయిన్ కానున్నాడు.

    తాజాగా ఈ చిత్రంకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈరోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రామ్ చరణ్ సరసన ఆమె RC 16లో నటిస్తుందని తెలిపింది.

    ఈ బ్యూటీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ దేవరతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. RC16 అని పేరు పెట్టని ఈ సినిమాలో జాన్వీ కపూర్ కీలక పాత్రలో నటిస్తుంది.

    Details

    చరణ్, జాన్వీ పెయిర్ పై ప్రేక్షకుల ఆసక్తి 

    జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా,నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌తో ఈ చిత్రానికి సంబంధించిన వార్తలను అధికారికంగా ప్రకటించింది.

    ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించనున్నారు.

    గతంలో, జాన్వీ కపూర్ తండ్రి, బోనీ కపూర్ ఒక ఇంటర్వ్యూలో ఈ వార్తలను ధృవీకరించారు.

    చరణ్, జాన్వీ పెయిర్ ఎలా ఉండబోతుందో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    ఎందుకంటే.. వెండి తెరపై చిరంజీవి-శ్రీదేవిలది హిట్ కాంబినేషన్. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో వీరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు.

    ఇప్పుడు వారి వారసులు జోడీగా తెరపై సందడి చేయబోతుండడం విశేషం.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మేకర్స్ చేసిన ట్వీట్ 

    Welcoming the celestial beauty on board for #RC16 ✨

    Happy Birthday to the mesmerizing #JanhviKapoor ❤️‍🔥#RamCharanRevolts
    Global Star @AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings pic.twitter.com/DGT335D4no

    — Mythri Movie Makers (@MythriOfficial) March 6, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జాన్వీ కపూర్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    జాన్వీ కపూర్

    లంగా ఓణీలో హోయలొలికిస్తున్న జాన్వీ పల్లెటూరి అందం.. తంగం కొత్త స్టిల్ రిలీజ్ దేవర
    RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025