Page Loader
RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్
RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్

RC16: రామ్ చరణ్ RC16 సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2024
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సనాతో ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చరణ్ శంకర్ గేమ్ ఛేంజర్‌ని పూర్తి చేసిన వెంటనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. RC 16 చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోందని ఆమె తండ్రి బోనీ కపూర్ ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా ధృవీకరించారు.

Details

టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఇది రెండవ చిత్రం

జాన్వీ త్వరలో RC16 షూటింగ్‌లో పాల్గొంటుందని , ఆమెకు తన తల్లి దివంగత శ్రీ దేవి ఆశీస్సులు ఉన్నాయని బోనీ కపూర్ పేర్కొన్నారు. బోనీ కపూర్ చేసిన ఈ ప్రకటనతో ఇప్పుడు RC16 లో హీరోయిన్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లయింది. దేవర తర్వాత టాలీవుడ్‌లో జాన్వీ కపూర్‌కి ఇది రెండవ చిత్రం. వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి RC16 నిర్మిస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్.