LOADING...
Jason Sanjay: తల్లికి అండగా నిలిచిన విజయ్ కుమారుడు.. తండ్రి పేరు తొలగింపు
తల్లికి అండగా నిలిచిన విజయ్ కుమారుడు.. తండ్రి పేరు తొలగింపు

Jason Sanjay: తల్లికి అండగా నిలిచిన విజయ్ కుమారుడు.. తండ్రి పేరు తొలగింపు

వ్రాసిన వారు Moogati Shabari
Mar 13, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ చిత్రసీమ, రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం నటుడు విజయ్ కుటుంబానికి సంబంధించిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆయన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం'తో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆయన కుమారుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు చర్చకు దారితీసింది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ త్వరలోనే దర్శకుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టనున్నాడు. అయితే తన కొత్త చిత్రానికి సంబంధించిన వివరాల్లో, అలాగే సోషల్ మీడియాలో కూడా ఆయన తన పేరును మార్చుకున్నట్లు సమాచారం.

వివరాలు

తల్లి పేరును చేర్చుతూ..

ఇంతకు ముందు ఆయన పేరు 'జాసన్ సంజయ్ విజయ్'గా ఉండేది. కానీ ఇప్పుడు తన పేరులో నుంచి తండ్రి పేరును తొలగించి, తల్లి పేరును చేర్చుతూ 'జాసన్ సంజయ్ సంగీత'గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. తల్లికి ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా, విజయ్ ఆయన భార్య సంగీత మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

వివరాలు

విడాకుల కోసం వెయిటింగ్

మరో నటితో విజయ్‌కు సన్నిహిత సంబంధం ఉందని ఆరోపిస్తూ సంగీత విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే విజయ్, నటి త్రిష మధ్య సన్నిహితంగా ఉండటంపై వచ్చిన వార్తలు ఈ విషయానికి మరింత ప్రాధాన్యత తెచ్చాయి. ఈ పరిస్థితుల్లో తన తల్లి ఎదుర్కొంటున్న కష్టాలను చూసి ఆమెకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే జాసన్ సంజయ్ తన పేరులో నుంచి తండ్రి పేరును తొలగించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement