LOADING...
Jatadhara: స‌ర్‌ప్రైజ్‌'గా ఓటీటీలోకి వ‌చ్చిన సుధీర్ బాబు హార‌ర్ థ్రిల్ల‌ర్‌ జటాధర
స‌ర్‌ప్రైజ్‌'గా ఓటీటీలోకి వ‌చ్చిన సుధీర్ బాబు హార‌ర్ థ్రిల్ల‌ర్‌ జటాధర

Jatadhara: స‌ర్‌ప్రైజ్‌'గా ఓటీటీలోకి వ‌చ్చిన సుధీర్ బాబు హార‌ర్ థ్రిల్ల‌ర్‌ జటాధర

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
11:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల విడుదలైన తెలుగుసూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా 'జటాధర'ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. పెద్దగా ప్రకటనలు లేకుండానే నిశ్శబ్దంగా డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలకమైన పిశాచి పాత్రలో కనిపించింది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ సినిమా,ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. జటాధర ఓటీటీ విడుదల సుధీర్ బాబు నటించిన తాజా హారర్ థ్రిల్లర్ మూవీ 'జటాధర' శుక్రవారం,డిసెంబర్ 5 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ధనపిశాచి కాన్సెప్ట్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా,ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సడెన్‌గా స్ట్రీమింగ్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈచిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకులకు అందుబాటులో ఉంది.

వివరాలు 

థియేటర్‌లో స్పందన 

నవంబర్ 7న థియేటర్లలో విడుదలైన జటాధర, సోనాక్షి సిన్హాకు తొలి తెలుగు సినిమాగా నిలిచింది. హారర్-థ్రిల్లర్ కథాంశం,కొత్త తరహా కాన్సెప్ట్ కారణంగా మూవీపై ముందుగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదలయ్యాక ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, థియేట్రికల్‌గా సుమారు రూ.6 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్లు సాధించింది. కథ ఏమిటంటే దెయ్యాలున్నాయనేది పూర్తిగా నమ్మని ఓ యువకుడు,ధన పిశాచి మధ్య జరిగే సంఘర్షణే జటాధర ప్రధాన కథ. శివ (సుధీర్ బాబు) ధైర్యవంతుడైన యువకుడు. ఆత్మలు, దెయ్యాలు అన్నీ మనుషుల ఊహలే తప్ప నిజం కాదని నమ్ముతాడు. అదే విషయాన్నినిరూపించేందుకు'పారా నార్మల్ సొసైటీ'తో కలిసి పనిచేస్తూ,దెయ్యాలున్నాయనే ప్రచారం నడుస్తున్న రుద్రారం గ్రామానికి చేరుకుంటాడు.

వివరాలు 

ధన పిశాచి మిస్టరీ 

పూర్వకాలంలో రహస్య నిధులకు కాపలాగా పిశాచ బంధనాన్ని ఉపయోగించేవారని చెప్పే కథ ఇందులో ఆసక్తికరంగా చూపించారు. అలాంటి ఒక ధన పిశాచి (సోనాక్షి సిన్హా) నిధుల రక్షణ కోసం బంధింపబడి ఉంటుంది. రుద్రారం చేరిన తర్వాత శివకు ఓ చిన్నారి హత్య జరిగిందన్న కలలు వస్తుంటాయి. ఆ చిన్నారి ఎవరు? శివకు ఆ గ్రామంతో ఉన్న రహస్య బంధం ఏమిటి? ధన పిశాచితో శివకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాల్ని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

వివరాలు 

సినిమా హైలైట్స్ 

'జటాధర'లో విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా సోనాక్షి సిన్హా ధన పిశాచిగా చేసిన నటన కొత్త రకమైన అనుభూతిని ఇస్తుంది. హారర్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒకసారి చూడదగ్గదే. ఆలస్యం ఎందుకు? అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'జటాధర'కు ఓ లుక్ వేయండి.

Advertisement