Loading...
Goud saab: 'గౌడ్‌సాబ్' నుంచి జాతర సాంగ్.. కైలాష్ ఖేర్ గళంలో 'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ' విడుదల!
'గౌడ్‌సాబ్' నుంచి జాతర సాంగ్.. కైలాష్ ఖేర్ గళంలో 'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ' విడుదల!

Goud saab: 'గౌడ్‌సాబ్' నుంచి జాతర సాంగ్.. కైలాష్ ఖేర్ గళంలో 'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ' విడుదల!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో ప్రతిభావంతులైన నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ తెరకెక్కుతున్న సరికొత్త మాస్ ఎంటర్‌టైనర్ 'గౌడ్‌సాబ్'(Goudsaab). ఈ సినిమాపై ప్రస్తుతం సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ తొలిసారిగా మెగాఫోన్ పట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక విరాట్ రాజ్ ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా మేకర్స్ ఓ అదిరిపోయే జాతర పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సంగీత ప్రియులను ఉర్రూతలూగించేలా రూపొందించిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. సినిమాలోని ఈ ప్రత్యేక గీతానికి 'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ' అనే ఆకర్షణీయమైన పల్లవిని పెట్టారు.

వివరాలు

సోషల్ మీడియాలో పాట వైరల్

పూర్తిగా తెలంగాణ సంస్కృతి, బోనాల పండుగ వైభవం ఉట్టిపడేలా ఈ పాటను హై-ఎనర్జీ జాతర సాంగ్‌గా తెరకెక్కించారు.

విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ జాతర పాటకు వెంగీ సంగీతం అందించడంతో పాటు క్యాచీగా ఉండే సాహిత్యాన్ని కూడా సమకూర్చడం విశేషం.

ఇక ప్రముఖ బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్త నదైన ప్రత్యేకమైన, పవర్‌ఫుల్ వాయిస్‌తో ఈ పాటను ఆలపించారు.

ఆయన గాత్రం జాతర సాంగ్‌కు మరింత ఊపు తీసుకొచ్చిందని చెప్పొచ్చు.

నక్షత్ర మూవీస్ పతాకంపై కల్వకోట వెంకట రమణ, 'ఎస్ఆర్ కల్యాణమండపం' రాజు సంయుక్తంగా ఈ భారీ మాస్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.

వివరాలు

జాతర సాంగ్ కు ప్రత్యేకమైన ఊపు

ఇప్పటికే విడుదలైన ఈ జాతర పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోకి దూసుకుపోతోంది. ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మొత్తంగా 'పెద్ద బొట్టు వెట్టిందిరా ఎల్లమ్మ' పాటలో తెలంగాణ సంస్కృతి, బోనాల పండుగ వాతావరణం, కైలాష్ ఖేర్ పవర్‌ఫుల్ వాయిస్, వెంగీ సంగీతం కలసి జాతర సాంగ్‌కు ప్రత్యేకమైన ఊపును తీసుకొచ్చాయి.

ADVERTISEMENT