Page Loader
జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా? 
జవాన్ ట్విట్టర్ రివ్యూ

జవాన్ ట్విట్టర్ రివ్యూ: షారుక్ ఖాన్ వరుసగా రెండవ హిట్ అందుకున్నాడా? 

వ్రాసిన వారు Sriram Pranateja
Sep 07, 2023
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జవాన్. నయనతార హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకొణె, ప్రియమణి అతిథి పాత్రల్లో కనిపించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాను గౌరీఖాన్ నిర్మించారు. విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ సినిమా, ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తొందరగా పడటంతో టాక్ బయటకు వచ్చింది. జవాన్ సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు ఏంటో చూద్దాం. జవాన్ సినిమా పూర్తిగా యాక్షన్ అంశాలతో నిండిపోయిందని, షారుక్ ఖాన్ ఎంట్రీ సీన్ అదిరిపోయిందని, బాలీవుడ్ లో ఏ హీరోకు కూడా అలాంటి ఎంట్రీ రాలేదని అంటున్నారు.

Details

ఆకట్టుకుంటున్న అనిరుధ్ రవించదర్ నేపథ్య సంగీతం 

మాస్ ప్రేక్షకులకు జవాన్ సినిమా విపరీతంగా నచ్చుతుందని, షారుక్ ఖాన్ కి మళ్ళీ హిట్ దక్కిందని కామెంట్స్ చేస్తున్నారు. జవాన్ సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు చాలా ఉన్నాయని అంటున్నారు. సినిమాలో యాక్షన్ అంశాలతో పాటు మంచి కామెడీ, థ్రిల్ ఉందని, దర్శకుడు అట్లీ, షారుక్ ఖాన్ ని కొత్తగా చూపించాడని నెటిజన్లు చెబుతున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఎప్పటిలాగే తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్ళిపోయాడని ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. నయనతార, దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి, ప్రియమణి తమ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే జవాన్ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జవాన్ ట్విట్టర్ రివ్యూ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జవాన్ ట్విట్టర్ రివ్యూ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జవాన్ ట్విట్టర్ రివ్యూ

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జవాన్ ట్విట్టర్ రివ్యూ