
జవాన్ నుండి మాస్ సాంగ్ రిలీజ్: షారుక్ ఖాన్ తో మరోసారి స్టెప్పులేసిన ప్రియమణి
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నుండి జవాన్ పేరుతో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి రిలీజైన ప్రివ్యూ వీడియోకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
హిందీ, తమిళం, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 7వ తేదీన విడుదల అవుతున్న ఈ సినిమా నుండి తాజాగా దుమ్ము దులిపేలా అనే పాట రిలీజైంది.
దుమ్మే దులిపేలా ఎగిరి ఎగిరి దూకెయ్, ధూలే రేగేలా ఎగిరి దుముకురా.. భూమే బెణికెలా అదరగొట్టెయ్ అంటూ సాగే పాట ఊపిరి వెచ్చంగా, ఊహలు పచ్చంగా ఉంటే మనిషండోయ్ అనే హుక్ లైన్ తో అద్భుతంగా ఉంది.
హిందీ పాటను తెలుగులో అనువాదం చేసినట్టుగా కాకుండా డైరెక్టు తెలుగు పాటలా వినిపిస్తోంది.
Details
ఆస్కార్ గ్రహీత అందించిన సాహిత్యం
ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా ప్రియమణి కనిపించింది. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాలో ప్రత్యేక గీతంలో షారుక్ ఖాన్ సరసన ప్రియమణి స్టెప్పులేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జవాన్ లో మరోసారి షారుక్ ఖాన్ తో స్టెప్పులేసింది.
దుమ్మే దులిపేలా పాటకు సాహిత్యాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ అందించగా, సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించి పాటను స్వయంగా ఆలపించాడు కూడా.
రెడ్ చిల్లీస్ బ్యానర్ లో తెరకెక్కుతోన్న జవాన్ సినిమాను గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. విజయ్ సేతుపతి, దీపికా పదుకునే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దుమ్ము దులిపేలా సాంగ్ రిలీజ్ పై ట్వీట్
సౌండ్ పెంచండి, ఎందుకంటే వచ్చింది #DhummeDhulipelaa సాంగ్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది!💥🕺🏼
— T-Series (@TSeries) July 31, 2023
Volume penchandi, endukante vacchindi! #DhummeDhulipelaa Song ippudu release ayyindi! 💥🕺🏼 https://t.co/18Q3Vphg2w#Jawan releasing worldwide on 7th September 2023, in Hindi, Tamil &… pic.twitter.com/AVDVJmzT7b