LOADING...
Jayam Ravi : కెనీషాతో జయం రవి తిరుమల ట్రిప్.. దేవున్ని మేసం చేయలేవన్న ఆర్తి!
కెనీషాతో జయం రవి తిరుమల ట్రిప్.. దేవున్ని మేసం చేయలేవన్న ఆర్తి!

Jayam Ravi : కెనీషాతో జయం రవి తిరుమల ట్రిప్.. దేవున్ని మేసం చేయలేవన్న ఆర్తి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 26, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది నుంచే వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం వారి విడాకుల కేసు కోర్టు పరిధిలో కొనసాగుతోంది. ఈలోగా జయం రవి తన స్నేహితురాలు, గాయని కెనీషాతో రిలేషన్‌లో ఉన్నారన్న వార్తలు ఇప్పటికే చర్చనీయాంశమయ్యాయి. ఎక్కడికెళ్లినా వీరిద్దరూ కలిసి కనిపిస్తున్నట్లు ఫొటోలు బయటకొచ్చాయి. తాజాగా ఈ జంట కలిసి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వారి ఈ ట్రిప్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Details

ఇతరులను మోసం చేయొచ్చు

ఇదే సమయంలో జయం రవి మాజీ భార్య ఆర్తి చేసిన సోషల్ మీడియా పోస్టులు మరోసారి హైలైట్ అయ్యాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'నువ్వు ఇతరులను మోసం చేయవచ్చు, నిన్ను నువ్వే మోసం చేసుకోవచ్చు.. కానీ దేవుణ్ణి మాత్రం ఎప్పటికీ మోసం చేయలేవు అంటూ రాసుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు నేరుగా జయం రవినే ఉద్దేశించి రాసినవని నెటిజన్లు భావిస్తున్నారు. అలాగే ఇటీవల ఆమె తన పిల్లల కోసం మరో నోట్ కూడా షేర్ చేశారు.

Details

విడాకుల తర్వాత రవి-ఆర్తి ఒకరిపై ఒకరు ఆరోపణలు

అందులో ఉత్తమ తల్లిదండ్రులంటే ఎల్లప్పుడూ పిల్లల గురించి ఆలోచించే వారే. ఎందుకంటే అమాయకమైన పిల్లలు అందరి ప్రేమకు అర్హులు. ఏ పరిస్థితులు వచ్చినా వారిని కాపాడాలని పేర్కొన్నారు. దీని ఆధారంగా ఆమె తన పిల్లల కోసం కఠినంగా నిలబడుతున్నారని అర్థమవుతోంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, విడాకుల ప్రకటన తర్వాత జయం రవి-ఆర్తి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అంతేకాదు, ఇటీవల ఆర్తి తన భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం ఇవ్వాలని కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.