The Bear Dominate Award Ceremony: 'ది బేర్'లో అద్భుత నటనకు జెరెమీ అలెన్ వైట్‌కు రెండోసారి ఎమీ అవార్డు
ప్రముఖ నటుడు జెరెమీ అలెన్ వైట్, మరోసారి 'ది బేర్' సిరీస్‌లో తన అద్భుత నటనకు గుర్తింపుగా, కామెడీ యాక్టర్ విభాగంలో వరుసగా రెండో ఎమీ అవార్డును గెలుచుకున్నారు. FX నెట్‌వర్క్‌లో ప్రసారమైన ఈ సిరీస్‌లో కార్మెన్ 'కార్మీ' బెర్జాట్టో పాత్రలో ఆయన చేసిన నటనకు ఈ పురస్కారం లభించింది. డామన్ వాయన్స్, జెస్సీ టైలర్ ఫెర్గూసన్, జార్జ్ లోపెజ్‌ల చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అవార్డును స్వీకరించిన వెంటనే ఎమోషనల్‌గా మారిన వైట్ తన అంగీకార ప్రసంగంలో అకాడమీ, తోటి నామినీలకు కృతజ్ఞతలు తెలిపారు.
ధన్యవాదాలు తెలిపిన అలెన్ వైట్
తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు చాలా ధన్యవాదాలని చెప్పారు. ఇంతటి గుర్తింపు తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పిన వైట్ 'ది బేర్ నా జీవితాన్ని మారుస్తూ, ఒంటరితనాన్ని అధిగమించగలమనే నమ్మకాన్ని కలిగించిందని పేర్కొన్నాడు. 'ది బేర్' ఈ సిరీస్ 2022లో ప్రారంభమై, అతన్ని A-జాబితా నటుడిగా మార్చింది. 'ది బేర్' కి ముందు, ఆయన 'షేమ్‌లెస్' సిరీస్‌లో ఫిలిప్ "లిప్" గల్లాఘర్ పాత్రలో ప్రసిద్ధి పొందారు.