Loading...
JoJo Glimpse : మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి.. 'జో జో' గ్లింప్స్‌లో మాస్ కామెడీ
మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి.. 'జో జో' గ్లింప్స్‌లో మాస్ కామెడీ

JoJo Glimpse : మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి.. 'జో జో' గ్లింప్స్‌లో మాస్ కామెడీ

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2026
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో కొత్త కథలు, స్థానిక జీవనశైలి నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల మాటతీరు, సహజమైన హాస్యంతో రూపొందుతున్న రూరల్ డ్రామాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సమర్పణలో తెరకెక్కుతున్న రస్టిక్ రూరల్ కామెడీ డ్రామా 'జో జో' ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. కిరణ్ జయ్ కుమార్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన 'కాషన్ 1' వీడియో గ్లింప్స్‌ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

వివరాలు 

జొన్నగిరి నేపథ్యంలో 'జో జో' కథ

రాయలసీమలోని ప్రముఖ ప్రాంతం జొన్నగిరి నేపథ్యంలో 'జో జో' కథ సాగుతుంది.

వర్షాలు కురిసిన తర్వాత రాయలసీమలోని పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం చాలాకాలంగా ఉంది.

ఈ ఆసక్తికరమైన అంశాన్ని కథలో ప్రధానంగా తీసుకుని, పల్లెటూరి ప్రేమకథకు హాస్యాన్ని జోడిస్తూ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

రాయలసీమ నేటివిటీ, అక్కడి వాతావరణం, గ్రామీణ యువత మాటతీరును ప్రతిబింబించేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు తాజాగా విడుదలైన గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది.

వివరాలు 

వజ్రాల కోసం వేట 

'కాషన్ 1' పేరుతో విడుదల చేసిన వీడియో ప్రారంభంలోనే "గమనిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి"అనే క్యాప్షన్‌ కనిపిస్తుంది.

ఈ హెచ్చరికతోనే గ్లింప్స్‌ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని మేకర్స్‌ కలిగించారు.

వర్షం కురిసిన తర్వాత పొలంలో హీరో,హీరోయిన్‌తో పాటు మరికొందరు వజ్రాల కోసం వెతుకుతుంటారు.

ఈ క్రమంలో హీరోయిన్‌కు ఓ రాయి దొరుకుతుంది.ఆమెను ఇష్టపడే హీరో దగ్గరకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.

అయితే,అతడికి హీరోయిన్‌ ఇచ్చే ఊహించని బూతు సమాధానం షాక్‌కు గురిచేస్తుంది.

హీరోతో పాటు పక్కనే ఉన్న స్నేహితుడు కూడా ఒక్కసారిగా అవాక్కవుతారు.

ఆ తర్వాత తేరుకున్న హీరో.. జరిగిన విషయాన్ని 'మోటు సరసం' అంటూ కవర్ చేసే తీరు నవ్వులు పూయిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

ఒక్క గ్లింప్స్‌తోనే యువతలో ఆసక్తి

ఈ సన్నివేశంతోనే సినిమాలోని రస్టిక్ కామెడీ ఏ స్థాయిలో ఉండబోతోందో మేకర్స్‌ పరిచయం చేశారు.

విజయ్ కృష్ణ లింగమనేని తన 'విజయం' బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.

మహేష్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణ కమల్, మాహి హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, మకరంద్ దేశ్‌పాండే, ఫణీంద్ర దేవరపల్లి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కేవలం ఒక్క గ్లింప్స్‌తోనే యువతలో ఆసక్తిని పెంచిన 'జో జో' సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుంది? అన్నది చూడాలి.

ADVERTISEMENT