NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎన్టీఆర్ బర్త్ డే: ఎన్టీఆర్ సినిమాల్లోని ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్ 
    తదుపరి వార్తా కథనం
    ఎన్టీఆర్ బర్త్ డే: ఎన్టీఆర్ సినిమాల్లోని ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్ 
    ఎన్టీఆర్ సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్

    ఎన్టీఆర్ బర్త్ డే: ఎన్టీఆర్ సినిమాల్లోని ఎప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 19, 2023
    09:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    డైలాగ్ చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని ప్రతీ అభిమాని అనుకుంటాడు. పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ స్టైలే వేరు.

    ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగుల గురించి మాట్లాడుకుందాం.

    ఆది:

    ఆదికేశవ రెడ్డిగా తనను తాను విలన్ కు పరిచయం చేసుకునే సమయంలో ఎన్టీఆర్ పలికే, అరవకు, అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అనే డైలాగ్ ఇప్పటికీ పాపులర్.

    టెంపర్:

    పూరీ నగన్నాథ్ సినిమాల్లో డైలాగులు చాకులా గుచ్చుకుంటాయి. టెంపర్ సినిమాలో, ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ మధ్య జరిగే మాటల యుద్ధంలో, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకడు మీదడిపోతే.. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అని ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఊపేసింది.

    Details

    ఆర్ఆర్ఆర్ లోని పవర్ ఫుల్ డైలాగ్ 

    బృందావనం:

    సిటీ నుంచొచ్చాడు సాఫ్ట్ గా లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు అనుకుంటున్నావేమో, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది, దాన్ని బయటకు తెచ్చావనుకో.. రచ్చ రచ్చే అని ఎన్టీఆర్ పలికే మాటలకు థియేటర్స్ షేక్ ఐపోయాయి.

    జై లవకుశ:

    ఆ రావణాసురుడిని దాటాలంటే సముద్రం దాటాలి, ఈ రావణాసురుడిని దాటాలంటే సముద్రమంత ధైర్యం ఉండాలి అనే పవర్ ఫుల్ డైలాగ్ ఇందులో ఉంటుంది.

    ఆర్ఆర్ఆర్:

    మల్లి ప్రాణాలు కాపాడాలన్న ప్రయత్నంలో, తెల్లదొరల కోటను బద్దలు కొట్టేముందు, తొంగి తొంగి కాదే, తొక్కుకుంటూ పోవాలే, ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే అనే డైలాగ్ అదిరిపోతుంది.

    Details

    డైలాగ్ వార్స్ 

    రాఖీ:

    రైల్వే డిపార్ట్ మెంటులో పనిచేస్తున్న ఉద్యోగిని ఆఫ్ట్రాల్ అన్నందుకు, రైల్వే డిపార్ట్ మెంటు గురించి, రైలు సర్వీసుల గురించి, అది చేస్తున్న సేవల గురించి గుక్క తిప్పుకోకుండా 2నిమిషాలు డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఎన్టీఆర్ నోటి నుండి విన్నప్పుడు ప్రతీ ఒక్కరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

    యమదొంగ:

    యమపాశాన్ని తన చేతికి చిక్కించుకుని, మోహన్ బాబుతో డైలాగ్ వార్ కి దిగుతాడు ఎన్టీఆర్. ఏమంటివి? ఏమంటివి అంటూ కీ.శే నందమూరి తారక రామారావు మాటలతో మొదలయ్యే ఈ డైలాగ్ కి ప్రేక్షకులు విజిల్ వేయకుండా ఉండలేరు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    తెలుగు సినిమా

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    హ్యాపీ బర్త్ డే సుధీర్ బాబు: పాన్ ఇండియా హీరోగా మారబోతున్న స్టార్ జీవితంలోని ఆసక్తికర విషయాలు  పుట్టినరోజు
    మళ్ళీ పెళ్ళి ట్రైలర్: ప్రేమలో ఏది చేసినా తప్పే కాదంటున్న నరేష్  ట్రైలర్ టాక్
    ఉస్తాద్ భగత్ సింగ్: గ్లింప్స్ కన్నా ముందు అదిరిపోయే పోస్టర్ రిలీజ్  పవన్ కళ్యాణ్
    ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్: ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది  పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025