Jr.Ntr-Bollywood-War 2-Dinner: జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో డిన్నర్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) వార్ 2 (War-2) సినిమాతో బాలీవుడ్ (Bollywood)ఇండస్ట్రీలో అరంగేట్రం చేస్తున్నారు. ఈ వార్ 2 సినిమా షూటింగ్ కోసం ఇటీవల ముంబై వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ తారలతో సందడి చేస్తున్నారు. తాజాగా ఆదివారం రాత్రి బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్ (Ranbir Kapur) , ఆలియా భట్ (Alia Bhat), హృతిక్ రోషన్ (Hruthik Roshan), సబా ఆజాద్ (Sabha Azad), కరణ్ జోహార్ (Karana Johar) లతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి (Pranathi) డిన్నర్ చేశారు. వీరు డిన్నర్ కు వెళ్లారో లేదో బాలీవుడ్ మీడియా మొత్తం వీరిమీదికి ఎగబడిపోయింది.
లేట్ గా జాయిన్ అయిన హృతిక్ రోషన్, సబా ఆజాద్
జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, ఆలియా భట్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత హృతిక్ రోషన్, సబా ఆజాద్ వాళ్లతో చేరారు. వార్ 2 మూవీలో హృతిక్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్టర్ చేస్తున్నాడు.