
మేకలను బలిచ్చి ఎన్టీఆర్ పోస్టర్ కు రక్తాభిషేకం: అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఎక్కడైనా, ఏ విషయంలో అతి మంచిది కాదని చెబుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం అరెస్టుకు దారి తీసింది.
మే 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా, తన 30వ సినిమా టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేసారు.
దేవర పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్ అభిమానులందరికీ బాగా నచ్చేసింది. దీంతో కర్ణాటకలోని రాబర్ట్ సన్ పేటలోని కొందరు అభిమానులు, దేవర పోస్టర్ కు రక్తాభిషేకం చేసారు.
రాబర్ట్ సన్ పేటలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్ల దగ్గరకు వచ్చిన అభిమానులు అక్కడున్న దేవర పోస్టర్ ముందు, మేకలను బలిచ్చారు.
Details
9మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
మేకలను బలివ్వడమే కాకుండా రక్తాన్ని పోస్టర్ మీద జల్లారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. రక్తాభిషేకం చేసిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసారు.
అరెస్ట్ అయిన వారిలో కే సాయి, డీ నాగభూషణం, పీ శివనాగరాజు, పీ నాగేశ్వర్ రావు, జీ సాయి, పీ శీవ, బీ అనిల్, వై ధరణి, వీ సాయి ఉన్నారు.
అదలా ఉంచితే, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.