'ఎన్టీఆర్ 30' టైటిల్ 'దేవర'; ఫస్ట్ లుక్‌లో పూనకాలు తెప్పిస్తున్న ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు(మే 20) కానుకగా నందమూరి అభిమానులకు 'ఎన్టీఆర్ 30' మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఎన్టీఆర్ 30' మూవీ పేరును 'దేవర'గా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు దేవర మూవీ ఫస్ట్ లుక్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మాస్ లుక్‌తో యంగ్ టైగర్ అదరగొట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ క్రేజీ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.