LOADING...
NTR: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వాయిదా.. జూన్‌లో స్పెషల్ ట్రీట్?
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వాయిదా.. జూన్‌లో స్పెషల్ ట్రీట్?

NTR: ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్ వాయిదా.. జూన్‌లో స్పెషల్ ట్రీట్?

వ్రాసిన వారు Moogati Shabari
May 22, 2026
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ లైనప్‌లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయనున్న భారీ సినిమా పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. నెవర్ బిఫోర్ స్కేల్‌లో తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఎప్పటినుంచో భారీ అంచనాలు ఉన్నాయి. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసిన కాన్సెప్ట్ టీజర్ వీడియోను విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, అది చివరి నిమిషంలో వాయిదా పడింది.

వివరాలు

క్రేేజీ ప్రాజెక్ట్‌పై త్వరలో అనౌన్స్‌మెంట్..

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై మరో లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆ స్పెషల్ ట్రీట్‌ను మేకర్స్ జూన్ నెలకు షిఫ్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రాన్ని యుద్ధానికి దేవుడిగా పూజించే కుమారస్వామి నేపథ్యంలో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ తో పాటు ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Advertisement