LOADING...
Devara : జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్!
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్!

Devara : జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' 1 ఇయర్ సెలబ్రేషన్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'దేవర' సినిమా ప్రేక్షకులను కనెక్ట్ చేసిందనే చెప్పాలి. ఇందులో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది విడుదలైనప్పటికీ, ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఫైనల్ రన్‌లో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. దేవర రిలీజ్‌కి నేటికీ సరిగ్గా ఏడాది పూర్తి కావడంతో, అభిమానులు #1YearForDevaraThandavam హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Details

దేవర్ 2 షూటింగ్ ఆలస్యం

ప్రారంభ రోజు రివ్యూలు మిక్స్ గా రావడం, ఓవర్సీస్ లో పెద్ద హైలైట్ లేకపోవడం, తెలుగు రాష్ట్రాల్లో సైతం మిక్స్ రివ్యూలు రావడం వంటి పరిస్థితులను కూడా దాటి 'దేవర బ్లాక్‌బస్టర్ హిట్'గా నిలిచింది. ఎన్టీఆర్ నటన, డాన్స్, క్రేజ్ సినిమాను భారీ హిట్‌గా మార్చింది. RRR వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, రాజమౌళి ప్రభావం ఉన్న సినిమాల తర్వాతే హీరోకు ఫ్లాప్ వస్తుందన్న సెంటిమెంట్ ను ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇంతకీ, దేవరకు సీక్వెల్ కూడా ప్లాన్‌ అయ్యింది. అయితే ఎన్టీఆర్ ఇతర సినిమాల కమిట్మెంట్ కారణంగా దేవర 2 షూటింగ్ ఆలస్యమవుతోంది. ఈ సీక్వెల్ సెట్స్‌పై ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.