LOADING...
War 2: వార్ 2 లవ్ సాంగ్‌పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా!
వార్ 2 లవ్ సాంగ్‌పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా!

War 2: వార్ 2 లవ్ సాంగ్‌పై జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2025
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'వార్ 2' త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కియారా అద్వానీ ఇందులో కథానాయికగా నటించింది. రిలీజ్‌కు 15 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రమోషన్ల వేగం పెంచిన చిత్రబృందం ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, పోస్టర్లు వదిలారు.

Details

'ఊపిరి ఊయలగా' ప్రోమో రిలీజ్

తాజాగా హృతిక్-కియారా మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్‌ 'ఊపిరి ఊయలగా' ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోను ఎన్టీఆర్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ, ప్రేమ అప్రయత్నంగా ఉన్నప్పుడు అది ఒక కలలా అనిపిస్తుంది. రేపు విడుదలయ్యే 'ఊపిరి ఊయలగా' పాట కోసం సిద్ధంగా ఉండండి!" అంటూ పోస్ట్ చేశారు. ఈ పాటతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగేలా అయ్యింది. ప్రేక్షకుల్లో 'వార్ 2'పై హైప్‌ క్రియేట్‌ చేస్తూ, ప్రమోషన్లను ఒకదాని తర్వాత ఒకటిగా రిలీజ్ చేస్తోంది చిత్రబృందం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రోమో రిలీజ్