Loading...
Jr NTR : బగీరా చనిపోయింది.. ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ పోస్ట్..
బగీరా చనిపోయింది.. ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ పోస్ట్..

Jr NTR : బగీరా చనిపోయింది.. ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ పోస్ట్..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తన పెంపుడు కుక్క 'బగీరా' మృతి చెందడంతో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బగీరాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. బగీరా తన జీవితంలోకి పెంపుడు శునకంగా వచ్చి.. కొద్దికాలంలోనే కుటుంబ సభ్యుడిగా మారిపోయిందని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు.

వివరాలు

నెట్టింట వైరల్..

"బగీరా.. నువ్వు నా జీవితంలోకి పెంపుడు శునకంలా వచ్చావు. కొంతకాలంలోనే మా కుటుంబ సభ్యుడిగా మారిపోయావు.

నీ ప్రేమ, విశ్వాసం, అల్లరితో ప్రతిరోజూ నా అలసటను దూరం చేశావు. ఇప్పుడు చెప్పలేనంత బాధను మిగిల్చి వెళ్లిపోయావు.

నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి" అంటూ ఎన్టీఆర్‌ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా బగీరాతో కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్‌ చేశారు. అవి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు

శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్‌..

ఇక ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆయన పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.

మరోవైపు ఎన్టీఆర్‌ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న 'డ్రాగన్‌' సినిమాలో నటిస్తున్నారు.

సినిమా వచ్చే ఏడాది జూన్‌ 11న థియేటర్లలో విడుదల కానుంది.

ADVERTISEMENT