ట్విట్టర్ కు పోటీగా వచ్చిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో జాయిన్ అయిన ఎన్టీఆర్, అల్లు అర్జున్
మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ ఫ్లాట్ ఫామ్ ను ఎలాన్ మస్క్ కొన్నప్పటి నుండి రోజూ ఏదో ఒక వార్తల్లో ట్విట్టర్ నిలుస్తూనే ఉంది. తాజాగా ట్విట్టర్ కు పోటీగా మెటా నుండి థ్రెడ్ యాప్ వచ్చేసింది. ఈ యాప్ ను మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ లాంచ్ చేసారు. లాంచ్ చేసిన కొద్ది గంటల్లోనే థ్రెడ్ యాప్ డౌన్ లోడ్స్ విపరీతంగా పెరిగాయి. ప్లే స్టోర్ లోకి వచ్చిన 4గంటల్లోనే ఐదు మిలియన్లకు పైగా డొన్లోడ్స్ జరిగాయని సమాచారం. తాజాగా టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కూడా థ్రెడ్ యాప్ లో అకౌంట్ తెరిచారు.
థ్రెడ్ యాప్ లో సైనప్ అయిన బాలీవుడ్ తారలు
థ్రెడ్ లోకి అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ సైనప్ కావడంతో ఫాలోవర్లు సైతం అమాంతం పెరిగిపోయారు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ తారలు సైతం థ్రెడ్ యాప్ లో సైనప్ అవుతున్నారు. తమన్నా, తాప్సీ, పరిణీతి చోప్రా, సన్నీ లియోన్ మొదలగు వారందరూ థ్రెడ్ యాప్ లోకి వచ్చేసారు. ఇన్స్ టాగ్రామ్, ట్విట్టర్ లో ఉండే సౌకర్యాలను థ్రెడ్ అందిస్తుండడంతో అందరినీ థ్రెడ్ యాప్ ఆకట్టుకుంటోంది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత థ్రెడ్ యాప్ లోకి వచ్చే సెలెబ్రిటీలు ఎవరో చూడాలి.