
MAD Square : 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం!
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద సాలిడ్ రన్‌తో దూసుకుపోతోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్, కథతో పెద్దగా సంబంధం లేకపోయినా, ఇందులోని కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మొదటి భాగాన్ని మించేలా అల్లరి చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నారు.
కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా, సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది.
ఈ చిత్రంలో ఎక్కడా బోర్ అనిపించకుండా సన్నివేశాలు చక్కగా రూపుదిద్దుకోవడం పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.
ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం యూత్‌ఫుల్ కామెడీ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సినిమా ఫుల్ మిల్స్ లాంటిదని చెప్పొచ్చు.
Details
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
యూత్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా 'మ్యాడ్ స్క్వేర్' సినిమాను ఎంతో ఆస్వాదిస్తున్నారు. ఈ మూవీ దాదాపు అన్ని ఏరియాల్లో సక్సెస్‌గా దూసుకెళ్లుతోందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.
తాజాగా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో వస్తున్న ఆదరణ దృష్ట్యా, చిత్ర యూనిట్ ఏప్రిల్ 4న గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ ఈవెంట్‌కు 'మ్యాన్ ఆఫ్ మాసెస్' జూ. ఎన్టీఆర్ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదైనా, ఈ సక్సెస్ మీట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది.