
మరో కొత్త యాడ్ షూట్ లో ఎన్టీఆర్: అదిరిపోతున్న కొత్త లుక్
ఈ వార్తాకథనం ఏంటి
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అటు సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్, మధ్యలో యాడ్ షూట్ కోసం బయటకు వచ్చారు.
తాజాగా కొత్త యాడ్ షూట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నట్లు సమాచారం. ఈ యాడ్ షూట్ నిన్ననే జరిగిందని వినిపిస్తోంది. అయితే ఈ యాడ్ షూట్ లో ఎన్టీఆర్ కొత్తగా కనిపించనున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. అల్ట్రా స్టైలిష్ కళ్ళద్దాలతో, గడ్డంతో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ ని ప్రముఖ హెయిర్ స్టయిలిష్ట్ ఆలీమ్ హకీమ్ రెడీ చేసారు.
Details
ఎన్టీఆర్ చేతిలో రకరకాల బ్రాండ్లు
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రకరకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు. లీషియస్, యాపీ ఫిజ్, మలబార్ ఇలా ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.
మరిప్పుడు పాల్గొన్న షూటింగ్, ఏ బ్రాండ్ కి సంబంధించినదో ఇంకా బయటకు రాలేదు. ఫిలిమ్ నగర్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, ప్రస్తుతం చేసిన యాడ్ షూట్ కోసం 6-8కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
ఇక సినిమాల విషయానికి వస్తే, దేవర తర్వాత బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్
Ad Shoot #NTR pic.twitter.com/1qtUtYCCBY
— RR💥 (@rrking99) August 9, 2023