
దేవర ఓటీటీ డీల్స్ ఫిక్స్: భారీ ధరకు దక్కించుకున్న ప్రముఖ సంస్థ?
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాతో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమవుతుంది.
ఈ సినిమా షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తామని చిత్రబృందం ఆల్రెడీ ప్రకటించేసింది.
ఈ క్రమంలో ఫాస్ట్ పేస్ లో దేవర షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం నవంబర్ చివరి నాటికి షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయని సమాచారం. తాజా సమాచారం ప్రకారం దేవర సినిమా ఓటీటీ డీల్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది.
Details
150 కోట్ల రూపాయలకు అమ్ముడైన దేవర డిజిటల్ రైట్స్
ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ దేవర డిజిటల్ హక్కులను భారీ ధర చెల్లించి సొంతం చేసుకుందని వినిపిస్తోంది.
దేవర డిజిటల్ రైట్స్ కోసం 150కోట్ల రూపాయలను నెట్ ఫ్లిక్స్ చెల్లించిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
అదలా ఉంచితే, ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో కనిపించనున్నాడు. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడు.