LOADING...
Jr. NTR: దిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్.. 72 గంటలు డెడ్ లైన్.. ఎందుకంటే?
దిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్.. 72 గంటలు డెడ్ లైన్.. ఎందుకంటే?

Jr. NTR: దిల్లీ హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్.. 72 గంటలు డెడ్ లైన్.. ఎందుకంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 09, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టు ద్వారాన్ని తట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వివిధ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు తన గుర్తింపు, వ్యక్తిత్వాన్ని అనధికారికంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వ హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉందని పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై, జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఫిర్యాదుకు మూడు రోజుల్లోగా స్పందించాలని సంబంధిత ఈ-కామర్స్, సోషల్ మీడియా కంపెనీలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Details

అసలు కేసు నేపథ్యం ఇదే

జూనియర్ ఎన్టీఆర్ తన పేరు, ఫోటో, తన గుర్తింపుతో సంబంధం ఉన్న ఏ ఇతర లక్షణాలనైనా అనుమతి లేకుండా ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ విచారించారు. జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ అడ్వకేట్ జె. సాయి దీపక్ వాదనలు వినిపించారు. తారక్ తరపున లాయర్ కోర్టులో తెలిపారు. అనేక ఈ-కామర్స్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ములు అనుమతి లేకుండా ఆయన గుర్తింపును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నాయని, ఇది స్పష్టంగా వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘన అని వాదించారు.

Details

మూడు రోజుల గడువు

వాదనలు విన్న కోర్టు, జూనియర్ ఎన్టీఆర్ ఫిర్యాదును ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్-2021 ప్రకారం అధికారిక ఫిర్యాదుగా పరిగణించి చర్యలు తీసుకోవాలని ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్ములకు ఆదేశించింది. స్పందించేందుకు కంపెనీలకు మూడ్రోజుల సమయం ఇచ్చింది. ఈ కేసు డిసెంబర్ 22న మళ్లీ విచారణకు రావడంతో, అప్పటికి మరింత వివరణాత్మక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు—అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, నాగార్జున, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, చిరంజీవి వంటి పలువురు ప్రముఖులు కూడా తమ గుర్తింపు దుర్వినియోగంపై ఇంతకుముందు కోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Details

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రాలు

2018లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' తర్వాత, ఎన్టీఆర్ 2022లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్‌తో కలిసి నటించారు. ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించడమే కాక, 'నాటు నాటు' పాట ఆస్కార్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది. అదే పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. తరువాత ఆయన 2024లో కొరటాల శివ తెరకెక్కించిన 'దేవర: పార్ట్ 1'లో నటించారు. ఇదే సంవత్సరం ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన 'వార్ 2'తో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈచిత్రంలో హృతిక్ రోషన్, కియారా అడ్వాణీ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే 'డ్రాగన్' అనే ప్రాజెక్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి.

Advertisement