
పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రీకరణ పనులు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిమ్ సిటీలో శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనమిచ్చారు. నిన్న సాయంత్రం, పుష్ప 2 సెట్స్ కి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళినట్లు సమాచారం అందుతోంది.
అల్లు అర్జున్, సుకుమార్ లతో కొంత సేపు ముచ్చటించినట్లు తెలుస్తోంది. వైట్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ లో పుష్ప 2 సెట్స్ లో కనిపించిన ఎన్టీఆర్ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
ఎన్టీఆర్ వెళ్లడానికి కారణమేంటి?
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతోందని సమాచారం.
Details
శరవేగంగా సాగుతున్న పుష్ప 2 షూటింగ్
రెండు సినిమాల షూటింగులు రామోజీ ఫిలిమ్ సిటీలోనే జరుగుతుండడంతో పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్ కనిపించారని అంటున్నారు. పుష్ప 2 సినిమా చిత్రీకరణ పనులు గతేడాది నవంబర్ లో మొదలయ్యాయి.
అప్పటి నుండి చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది పుష్ప 2 చిత్రం. పుష్ప 2 నుండి రిలీజైన వేర్ ఈజ్ పుష్ప అనే చిన్నపాటి వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్30 విషయానికి వస్తే, ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్
పులి @tarak9999 🐅 ❤️🔥#ManOfMasessNTR #JrNTR pic.twitter.com/bG9hUWpqut
— tarak.fan.girls (@TarakfanGirls) April 27, 2023